రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి
హెడ్‌కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ పొందినవారికి ఉత్తర్వులు అందజేత
జ్యోతినగర్, ఏప్రిల్ 7: ఉద్యోగోన్నతి బాధ్యతను పెంచుతుందని సీపీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం జోన్ పరిధిలో 225మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ రాగా గురువారం ఎన్టీపీసీ ఈడీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ వారికి అలాట్ ఉత్తర్వు పత్రాలు అందజేశారు. బ్యాడ్జి పెట్టి అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉత్తమ సేవలతోనే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందన్నారు. పోలీస్ సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, అడిషనల్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, ఏవో నాగమణి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కణతాల లక్ష్మీనారాయణ, ఆర్ఐలు మధుకర్, శ్రీధర్, విష్ణుప్రసాద్, సూపరింటెండెంట్ సందీప్, సీనియర్ అసిస్టెంట్లు మనోజ్, జగదీశ్ తదితరులున్నారు.