హుజూరాబాద్‌టౌన్/వీణవంక/ ఇల్లందకుంట, ఏప్రిల్ 6: దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధుకు అంకురార్పణ చేశారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. హుజూరాబాద్ మండలం మాందాడిపల్లికి చెందిన శారదాసతీశ్కు దళితబంధు కింద మంజూరైన ఆటోస్టోర్ను ఆయన ప్రారంభించారు. అలాగే, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి హుజూరాబాద్‌లో వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన దరిపెల్లి శారదాసారయ్య ఏర్పాటు చేసిన ఇంటర్నెట్, మీసేవ కేంద్రం, మల్లారెడ్డిపల్లిలో కిన్నెర సునీతామల్లేశ్ ఏర్పాటు చేసిన కిరాణం, జనరల్ స్టోర్‌ను ప్రారంభించారు. అలాగే, ఇల్లందకుంట మండలం మర్రివాణిపల్లెకు చెందిన రాజుకు మంజూరైన హార్వెస్టర్‌ను జడ్పీచైర్‌పర్సన్ కనుమల్ల విజయ ప్రారంభించారు. అంతకుముందు ఆమె సమక్షంలో ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో వాహనానికి పూజలు చేశారు. ఆయాచోట్ల వీరు మాట్లాడుతూ దళితులు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని, ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్ కింద అర్హులందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
ఈ స్కీంను ప్రారంభించినప్పుడు విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆయా చోట్ల నాయకులను లబ్ధిదారులు సన్మానించారు. హుజూరాబాద్‌లో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, మందాడిపల్లి సర్పంచ్ ఆరిపెల్లి ఎల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు సంపంగి మైకెల్, టీ వెంకటేశ్‌గౌడ్, ఈ శ్రీనివాస్, వీణవంక మండలంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మావురపు విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచులు బండ సుజాత-కిషన్‌రెడ్డి, ఎల్లారెడ్డి, పింగిలి కోమాల్రెడ్డి, ఎంపీటీసీ మూల రజిత, మాజీ జడ్పీటీసీ ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ తాండ్ర శంకర్, నాయకులు మర్రి స్వామి, సమ్మిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఆవుల తిరుపతి, ప్రకాశ్, శ్యామ్, తిరుపతి, రాజయ్య, ఇల్లందకుంటలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కలాల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ వీరస్వామి, నాయకులు అభిలాశ్, తారక్, రాజశేఖర్, రాజు పాల్గొన్నారు.