చిగురుమామిడి, ఏప్రిల్ 5: ఉపాధి హామీ పథకం కూలీలకు ఉపాధితో పాటు గ్రామాల అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతున్నది. పల్లె ల రూపురేఖలు మార్చుకునేందుకు ఈజీఎస్ నిధులు ఎంతగానో దోహదపడుతున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు, మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లు, వ్యవసాయ కల్లాలు మొదలగువాటిని తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి చేపడుతున్నది.
టీఆర్ఎస్ పాలనలో పల్లె వెలుగులు
టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పల్లెల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, చెరువుల్లో పూడికతీత పనులు, పిచ్చి మొకల తొలగింపు, వ్యవసాయ భూముల వద్దకు రహదారులు, అంతర్గత డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించారు. మండలంలోని 17 గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు మొదలగునవి ఏర్పాటు చేశారు.
తొలగిన సమస్యలు
గ్రామాల్లో ఎవరైన మృతిచెందితే అంత్యక్రియల సందర్భంగా నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. వాగులు, రహదారులు, చెరువుల వద్ద దహన సంసారాలు అనేక ఇబ్బందుల నడుమ నిర్వహించేవారు. స్నానాలు చేయడం, దుస్తులు మార్చుకునేందుకు ఇబ్బందులు పడేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా వైకుంఠధామం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. నివాసాలకు దూరంగా 5 గుంటల స్థలాన్ని సమకూర్చి డంప్ యార్డుల నిర్మాణం చేపట్టింది. చెత్తను తరలించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను సమకూర్చింది. ఇందుకు రెండు మూడు లక్షల వరకు కేటాయించింది. గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగడంతో అనేక సమస్యలు పరిషారమయ్యాయి. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఈజీఎస్ నిధులతో గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకునేందుకు వీలు కలి గింది. గ్రామాభివృద్ధి కోసం సర్పంచులు పడే శ్రమను ప్రభుత్వం గుర్తించి ఈజీఎస్ ద్వారా నిధులను అందజేసింది. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా సహకారముంటున్నది. సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలి.
– నర్సయ్య, ఎంపీడీవో, చిగురుమామిడి