జమ్మికుంట రూరల్, ఏప్రిల్ 5: మండలంలోని గండ్రపల్లి గ్రామంలో మంగళవారం ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెచ్‌వోడీ డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు, వందేభారత్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు 342 మందికి సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఎముకలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మందులను అందజేశారు. 66 మంది ని మెరుగైన చికిత్స కోసం ప్రతిమ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. ఈ సందర్భంగా వందే భారత్ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్‌రావు, సర్పంచ్ బలుగూరి పద్మాసమ్మారావు, ఎంపీటీసీ తోట కవితాలక్ష్మణ్ మాట్లాడారు.
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెగా వైద్య శిబిరం నిర్వహించిన ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తనుగుల ఎంపీటీసీ వాసాల నిరోషారామస్వామి, సహకార సంఘం అధ్యక్షుడు పొల్సాని వెంకటేశ్వర్రావు, ఉప సర్పంచులు బుచ్చయ్య, ప్రియాంకామహేశ్, మాజీ సర్పంచులు పొల్సా ని అశోక్‌రావు, సంపత్, సంపత్‌రావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ హేమచందర్‌రావు, అడ్తీదారుల సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, గండ్రపల్లి, తనుగుల గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.