గంగాధర, ఏప్రిల్ 4 : తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మండలంలోని మధురానగర్‌లో సొమవారం నిరసన దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు పూటకో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో వడ్లు కొనగోలు చేసిన కేంద్రం తెలంగాణకు వచ్చే సరికి కొర్రీలు పెడుతున్నదన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని చేసిన తీర్మానం కాపీని తహసీల్దార్ శ్రీనివాస్‌కు అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిర్మల్‌రావు, కొండగట్టు బోర్డు డైరెక్టర్లు పుల్కం నర్సయ్య, ఉప్పుల గంగాధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్లు వేముల భాస్కర్, తాళ్ల సురేశ్, సర్పంచులు వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, మడ్లపెల్లి గంగాధర్, జోగు లక్ష్మీరాజం, నజీర్, ముక్కెర మల్లేశం, ఆకుల శంకరయ్య, రాసూరి మల్లేశం, పొట్టాల కనకయ్య, దోర్నాల హన్మంత్‌రెడ్డి, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి, కోలపురం లక్ష్మణ్, నాయకులు వేముల అంజి, తోట మహిపాల్, రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, ఆకుల మధుసూదన్, తడిగొప్పుల రమేశ్, సామంతుల శ్రీనివాస్, నిమ్మనవేణి ప్రభాకర్, సుంకె అనిల్, పెంచాల చందు, మ్యాక వినోద్, మామిడిపెల్లి అఖిల్, దూస అనిల్, ఇరుగురాల రవి పాల్గొన్నారు.
ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలి
చొప్పదండి, ఏప్రిల్ 4: తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలకేంద్రంలోని తెలంగాణ చౌరస్తావద్ద కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పండించిన ధాన్యం మొత్తం కొనేలా కేంద్రమే కొనేలా చూస్తామని గతంలో ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ రైతాంగం పక్షాన ఢిల్లీలో ఈ నెల 11న దీక్ష చేయనున్నారని తెలిపారు. నిరసన దీక్షకు విద్యార్థులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, సర్పంచులు గుంట రవి, వెల్మ నాగిరెడ్డి, గుడిపాక సురేశ్, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, మాడూరి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోకరాజేశ్వర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు పాషా, నాయకులు నలుమాచు రామకృష్ణ, మాచర్ల వినయ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గన్ను శ్రీనివాస్‌రెడ్డి, మహేశుని మల్లేశం, ఏనుగు స్వామిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, యువరాజు, గాండ్ల లక్ష్మణ్, దండె కృష్ణ, మావూరం మహేశ్, అశోద రాజయ్య, తిరుపతి, బీసవేని రాజశేఖర్, అన్నాడి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
వడ్లుగొంటమనోళ్లు యేవవాయిరి
రామడుగు, ఏప్రిల్ 4 : రాష్ట్రంలో రైతులు పండించే వడ్లు కొంటామని చెప్పిన బీజేపోళ్లు యేడవాయిరని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వేంకటేశ్వరరావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆహారశాఖ మంత్రి పీయూష్‌గోయల్ పార్లమెంట్ సాక్షిగా రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, కొక్కెరకుంట పీఏసీఎస్ చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జూపాక కరుణాకర్, జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, కొండగట్టు దేవాలయ బోర్డు డైరెక్టర్ దాసరి రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, రామడుగు సింగిల్‌విండో వైస్ చైర్మన్ గంట్ల రవీందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బండ అజయ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎల్కపల్లి లచ్చయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.