తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 4: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవెందర్రెడ్డి, స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని గర్భిణులకు సీమంతం చేశారు. ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలితతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, ఆడబిడ్డలకు చీరె, సారె అందజేసి దీవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టారన్నారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులను సత్కరించారు. ఇక్కడ జడ్పీటీసీ శైలజ, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, సీడీపీవో సబిత, సూపర్వైజర్ శ్రీలత, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే సంబురం
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 4: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే మహిళల జీవితం సంతోషమయమైందని ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత అన్నారు. సోమవారం ఎల్ఎండీలోని మహిళా ప్రాంగణంలో మహిళాభివృద్ధి సంస్థ, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు ఇస్తున్న శిక్షణను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. ఏజీఎం సబిత, ప్రాంగణం మేనేజర్ సునంద, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
రేకొండ లో గర్భిణులకు సీమంతం
చిగురుమామిడి, ఏప్రిల్ 4: పోషణ్ అభియాన్‌లో భాగంగా సోమవారం రేకొండలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ సీడీపీవో అరవింద, తహసీల్దార్ ముబీన్‌అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, మండల వైద్యాధికారి నాగశేఖర్ మాట్లాడుతూ గర్భిణులు ఆకుకూరలు సీజనల్ పండ్లు, పాలు, గుడ్లు, ఐరన్ ఎకువగా ఉండే బెల్లం, పల్లీలు, మునగ, గోంగూర, మొలకెత్తిన గింజలు తినాలని సూచించారు. బిడ్డ పుట్టిన అరగంటలోపు ముర్రుపాలు పట్టించారని సూచించారు. శిశువుకు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలన్నారు. ఏడో నెల నుంచి తల్లి పాలతో పాటు అనుబంధ పోషకాలను అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల రజిత, సూపర్వైజర్ ఇందిర, అంగన్వాడీ టీచర్లు చాడ తిరుమల, నీల రేణుక, పరిపాటి శారద, కల్వల లలిత, పంచాయతీ కార్యదర్శి లావణ్య, కారోబార్ రాజ్‌కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.