పవన్‌కల్యాణ్ బత్తుల కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పురుషః’. హాసిని సుధీర్ కథానాయిక. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా సికింద్రాబాద్‌లోని కస్తూర్బా ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో ఈ సినిమాలోని పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘చాటు చాటు..’ అంటూ సాగే ఈ పాటను అనంతశ్రీరామ్ రాయగా, శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచారు. చిన్మయి శ్రీపాద ఆలపించారు. ట్యూన్‌కి తగ్గట్టు సహజమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించామని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. రాయంచ కొక్కిరి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ఇందులో కీలక పాత్రధారులు.