హెల్త్ ప్రొఫైల్‌కు ప్రజలు సహకరించాలి
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని
వేములవాడ, ఏప్రిల్ 4: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు కోరారు. సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఆరోగ్య వివరాలు వైద్య సిబ్బంది సోమవారం సేకరించారు, ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ హెల్త్ ప్రొఫైల్ డాటా సేకరణ దేశానికే ఆదర్శమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక్కడ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ రేగులపాటి మహేశ్‌రావు, ఏఎన్ఎం సృజన, ఆశ కార్యకర్తలు జ్యోతి, లత, మహేశ్వరి తదితరులు ఉన్నారు.
దవాఖానకు లక్ష విరాళం
వేములవాడ ఏరియా దవాఖానలో మౌలిక వసతులు కల్పించేందుకు గానూ చెన్నమనేని రాజేశ్వర్‌రావు-లలితాదేవి ఫౌండేషన్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. దవాఖాన అవసరాలకు వినియోగించాలని సూపరింటెండెంట్ మహేశ్రావుకు సూచించారు.
సమన్వయంతో పని చేయాలి
మేడిపల్లి, ఏప్రిల్ 4: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఎంపీపీ ఉమాదేవి అధ్యక్షతన మండల పరిషత్‌లో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావుతో కలిసి ఆయన హాజరై, మాట్లాడారు. ఏడు హెల్త్ సెంటర్లకు నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోటాలో 40 శాతం నిధులు పాఠశాలలకు కేటాయిస్తున్నట్లు పేర్కోన్నారు. అనంతరం సెర్ఫ్ ఉద్యోగులు ఎమ్మెల్యేను సన్మానించారు. తర్వాత 55మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.