సైదాపూర్, ఏప్రిల్ 4: రైతులు యాసంగిలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో రైతులతో కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రైతాంగానికి సరిపడా సాగునీరు అందేలా కృషి చేస్తున్నదని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ ప్రభుత్వమేమో వడ్లను కొనకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నదని ఆరోపించారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ తీసుకున్న కార్యక్రమాల్లో రైతులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రైతన్నలకు అండగా ఉండి టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి కాయిత రాములు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.