కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 1: జిల్లా కేంద్రంలోని కోరా, జాన్సన్ గ్లోబల్ హైసూల్లో శుక్రవారం ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాలల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ మాట్లాడారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ ఊటూరి మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు ఎంవీ వరప్రసాద్, రాంరెడ్డి, వంగల సంతోష్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఏప్రిల్ 1: నగరంలోని మానేరు విద్యా సంస్థలో శుక్రవారం ముందస్తుగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణను మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. విద్యార్థులు తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి హాజరయ్యారు. ఉపాధ్యాయులతో కలిసి ఉగాది పచ్చడి తయారు చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పండుగలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఉగాది వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రామడుగు, ఏప్రిల్ 1: మండలంలోని గోపాల్రావుపేట శ్రీ ప్రగతి హైస్కూల్ ఆవరణలో ఉగాది పండుగ విశిష్టతను తెలుపుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరస్పాండెంట్ అన్నదానం రాధాకృష్ణ మాట్లాడుతూ, చిన్నారులకు ఉగాది పండుగ విశిష్టతను వివరించేందుకే ముందస్తు వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పాఠశాల కరస్పాండెంట్ రాధాకృష్ణ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకట్‌నారాయణ, డైరెక్టర్లు బేతి భూమయ్య, మునీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, ఏప్రిల్ 1: మండలంలోని ఒద్యారం, బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయులు ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రావు, లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఉగాది పండుగ విశిష్టత గురించి వివరించారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.