హుజూరాబాద్టౌన్,మార్చి 24: కారులో సొం తూరికి వెళ్తున్న రిటైర్డ్ ఎస్ఐ మృత్యుఒడికి చేరా డు. మరో గంటలో ఇంటికి చేరేలోగా అనుకొని ప్రమాదంలో దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హను మకొండ జిల్లా నడికుడ మండలం నర్సక్కపల్లికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ పాడి రాజిరెడ్డి (60) కరీంనగర్లోని గోదాంగడ్డలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. వ్యక్తిగత పనిపై గురువారం తెల్లవారుజామున కరీంనగర్ నుంచి సొంతూరైన నర్సక్కపల్లికి కారులో బయల్దేరాడు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులో రోడ్డుపక్కన ఉన్న తాటిచెట్టు ను అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘ టనలో రాజిరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. కారు ముందుభాగం నుజ్జును జ్జు అయి కారులోని బెలూన్స్ ఓపెన్ అయి పగిలిపోయాయి. కొంతకాలం ఎస్ఐబీలో పనిచేసిన రాజిరెడ్డి నక్సల్స్ ఏరివేతలో కీలకభూమిక పోషించాడు. చిగురుమామిడిలో ఏఎస్ఐగా పనిచేసిన ఆయన మద్దూర్ ఎస్ఐగా రిటైర్డ్ అయ్యాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన అందరితో కలివిడిగా ఉండేవాడు. రాజిరెడ్డికి కూతురు, కుమారుడు, భార్య ఉన్నారు. కాగా, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.