కొత్తగూడెం సింగరేణి, మార్చి 21: వచ్చే నెల లో ప్రక్రియను మొదలుపెట్టి మే నెలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ‘నమస్తే’తో మాట్లాడుతూ… ఇప్పటికే అనేక సార్లు ఆర్ఎల్సీ, ఏఎల్సీలకు సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని విన్నవించినట్లు చెప్పారు. మార్చి నె లతో సింగరేణి ఆ ర్థిక సంవత్సరం ముగుస్తుందని, ఇ క వెంటనే గుర్తింపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఈ నెల 28, 29 తేదీల్లో జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు టీబీజీకేఎస్ సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణిలో నాలుగు బొగ్గుబ్లాకులను ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకున్నామని, భవిష్యత్తులో కూడా ప్రైవేట్ పరం కాకుండా చూస్తామన్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో కేంద్ర మంత్రిని కలిసి సింగరేణిలో బొగ్గు బ్లాకులను సం స్థకే కేటాయించాలని కోరతామని చెప్పారు. సింగరేణిలో నియామకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 95 శాతం స్థానికులకు, 5 శాతం స్థానికేతరులకు వర్తింపజేయాల న్నారు. సింగరేణిలో కొం త మంది ఆంధ్రా అధికారులు తెలంగాణ అధికారులను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, బాధితులు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు. సింగరేణి కార్మికులకు సొంతింటి స్థలం విషయమై సీఎం కేసీఆర్‌తో చర్చించి న్యా యం చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంత పాత్రికేయులందరికీ యాజమాన్యం క్వార్టర్లు కేటాయించే విషయమై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌తో చర్చించి వీలైనంత త్వరలో ఇప్పించేందుకు చ ర్యలు తీసుకుంటామన్నారు.