హుషారుగా హోలీ వేడుకలు
రంగునీళ్లలో తడిసిముద్దయిన యువతీ యువకులు
చిన్నారుల కేరింతలు..డీజే పాటల నృత్యాలు
ఉత్సవాల్లో మంత్రి గంగుల, కలెక్టర్, సీపీ, అధికారులు
కమాన్ చౌరస్తా, మార్చి 18;ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం హోలీ సంబురం అంబరాన్నంటింది. ఎక్కడ చూసినా యువత కేరింతలతో సందడి కనిపించింది. యువతీ యువకులు ఉదయాన్నే కలర్ డబ్బాలతో బైక్‌లపై తిరుగుతూ కనిపించారు. వేస్తూ కేరింతలు కొడుతూ జోష్‌లో మునిగితేలారు. ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లి రంగులు పూసి హంగామా చేశారు. ‘డీజే టిల్లు పేరు.. వీని ైస్టెలే వేరు’ వంటి హుషారెత్తించే పాటల మధ్య డ్యాన్స్‌లతో హోరెత్తించారు. మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు ప్రజాప్రతినిధులు, కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, సీపీ సత్యనారాయణ, మేయర్ సునీల్‌రావు రంగు నీళ్లల్లో తడిసిముద్దయ్యారు.
కరీంనగర్ జిల్లాలో గురువారం హోలీ వేడుకలు జోరుగా..హుషారుగా జరుపుకొన్నారు.మహిళలు, యువతీయువకులు, చిన్నారులు రంగుల సంబురాల్లో మునిగితేలారు. బైక్‌లపై తిరుగుతూ, ఈలలు కొడుతూ సందడి చేశారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రంగులు పూసుకొని పరస్పరం పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణచౌక్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్, సీపీ సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకొని కలెక్టర్ ఆర్వీకర్ణన్‌కు రంగులు చల్లి శుభాకాంక్షలు చెప్పారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. మేయర్ సునీల్‌రావు కరీంనగర్లో పలుచోట్ల నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. హుజూరాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ కార్యకర్తలతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు. టీఎన్టీవోస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఉద్యోగులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.
జిల్లాలో రంగుల కేళీ హోలీ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఆయా కాలనీలు, వీధుల్లో ఒకరికొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో వేడుకలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన సీసీ సత్యనారాయణతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ టీఎన్జీవోస్ నాయకులు, పోలీస్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఆయా డివిజన్లలో సంబురాలు చేసుకున్నారు. నగరంలోని ఆయా కాలనీల్లో మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.