సీఎం కేసీఆర్ నిబద్ధతకు కొలమానం
గాయత్రీ బాహుబలి మోటర్ దేశానికే తలమానికం
పెద్దపల్లి, చేవెళ్ల ఎంపీలు వెంకటేశ్ నేతకాని, రంజిత్‌రెడ్డి
నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల సందర్శన
రామడగు/ ధర్మారం మార్చి18: కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమైన మానవ నిర్మాణమని పెద్దపల్లి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, గడ్డం రంజిత్‌రెడ్డి అభివర్ణించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది, రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌లను శుక్రవారం సాయం త్రం పారిశ్రామికవేత్తలతో కలిసి సందర్శించారు. నందిపంప్హౌస్లో అండర్ టన్నెల్ ద్వారా వెళ్లి పంప్‌హౌస్, సర్జిఫూల్, సబ్‌స్టేషన్‌ను పరిశీలించా రు. ఈ సందర్భంగా నీటి పంపింగ్ తీరును ఇంజినీరింగ్ అధికారులు వారికి వివరించారు. గాయ త్రీ పంప్‌హౌస్‌లో ముందుగా డెలివరీ సిస్టర్న్‌కు చేరుకొని పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి నీటి ఎత్తిపోతల తీరును తెలుసుకున్నారు. అనంతరం పార్కును సందర్శించారు. అక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా సర్వీస్బేకు చేరుకొని మోటర్లను పరిశీలించారు. సాంకేతిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయత్రీ పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన బాహుబాలి మోటర్లు దేశంలో తెలంగాణలో మాత్రమే ఉన్నాయన్నారు.
నంది రిజర్వాయర్ నుంచి జంట సొరంగాల ద్వారా గాయత్రీ పంప్పుహౌస్కు చేరుకునే కాళేశ్వరం జలాలు ఇక్కడి నుంచి 5.7 కిలోమీటర్ల దూరంలోని వరదకాలువకు గ్రావిటీ ద్వారా వెళ్తాయని ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు వివరించారు. అక్కడి నుంచి కుడివైపు ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా మల్యాల రాంపూర్ పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి ఎస్సారెస్పీకి తరలిపోతాయన్నారు. ఎడమవైపు వరదకాలువ ద్వారా శ్రీరాజరాజేశ్వర (మిడ్ మానేరు)కు తరలిస్తామన్నారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు కాళేశ్వరం ప్రాజెక్టు కొలమానంగా నిలుస్తున్నదని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు ని ర్మించి మెట్ట ప్రాంతాలను జలాలతో అభిషేకించారని కొనియాడారు. ఇక్కడ ప్రాజెక్టు అధికారులు డీఈఈలు రాంప్రసాద్, నర్సింగరావు, మెగా ఏజన్సీ ప్రతినిధులు నగేశ్, ప్రసాద్ ఉన్నారు.