చిన్న వయస్సులోనే ఉద్యోగాలు సాధించిన తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు
త్రివిధ దళాల్లో 1365 కొలువులు
కొత్తపల్లి, మార్చి 18 : దేశ సేవ చేయాలనే యువకుల కల, ఆశయాలను కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ జూనియర్ కళాశాల సాకారం చేస్తున్నది. ఇండియన్ ఆర్మీ, నేవీతో పాటు భారత వాయుసేనలోని పలు విభాగాల్లో ఈ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ప్రతిభను కనబరిచారు. యువతను త్రివిధ దళాల్లోని ఉద్యోగాలకు ఎంపికయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిపై అవగాహన కల్పిస్తోంది. కేంద్రం కల్పిస్తున్న ఈ ఉద్యోగావకాశాల్లో జిల్లాలోని మారుమూల గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువత సైతం ప్రతిభను కనబరిచి విజయం సాధిస్తున్నది. ప్రణాళికా బద్ధమైన చదువుతో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్న తేజస్ ఢిఫెన్స్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో త్రివిధ దళాల్లో ఉద్యోగాలను సాధిస్తున్నారు.
అనుభవజ్ఞులైన వ్యాయామ ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌తో విద్యాబోధన చేయ డం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ సీహెచ్ సతీశ్‌రావు పేర్కొంటున్నారు. తేజస్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏ అక్షయ్, ప్రశాంత్, సుకుమార్, జీ ప్రణీత్, కే తేజ, టీ సాయి ప్రణయ్ అనే ఆరుగురు విద్యార్థులు ఇటీవల వెలువడిన ఇండియన్ నేవీ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించారని అకాడమీ డైరెక్టర్ తెలిపారు. 11 సంవత్సరాల అకాడమీ నిర్వహణలో ఇప్పటి వరకు ఆర్మీలో 735 మంది, నేవీలో 312, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 136, కోస్ట్ గార్డ్‌లో 44, ఎస్సెస్సీ జీడీలో 138 మందితో మొత్తంగా 1365 మంది విద్యార్థులు డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధించారని వివరించారు.
లెక్చరర్ల ప్రోత్సాహం విజయానికి కారణం
లెక్చరర్ల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం ఇండియన్ నేవీ లో ఉద్యోగం సాధించేందుకు దోహదం చేశా యి. చిన్న వయస్సులోనే ఉద్యోగం సాధించడం చాలా సంతోషంగా ఉంది. యువత తాము కన్న కలను సాకారం చేసుకొనేందుకు మంచి అకాడమీని ఎంచుకోవాలి. తేజస్ డిఫెన్స్ అకాడమీ ద్వారా చాలా మంది విద్యార్థులు త్రివిధ దళాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు.
– అక్షయ్