ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలి
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
టీఆర్ఎస్లో చేరిన యూత్ కాంగ్రెస్ నేత
గన్నేరువరం, మార్చి 18: పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసే ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు ఉంటుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు కూన సంతోష్ గురువారం రాత్రి జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీఆర్ఎస్ యూత్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గన్నేరువరానికి చెందిన మంగలారపు కృష్ణకాంత్, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్‌గా నక్క దామోదర్‌కు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ బద్దం తిరుపతిరెడ్డి, నాయకులు బూర వెంకటేశ్వర్లు, గూడూరి సురేశ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.