చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఉప్పర మల్యాలలో లక్ష్మీనృసింహస్వామి జాతరకు హాజరు
గంగాధర, మార్చి 18: సంస్కృతీసంప్రదాయాలకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం విలసిల్లుతోందని, రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఉప్పరమల్యాల లక్ష్మీనృసింహస్వామి జాతరను నిర్వహించగా శుక్రవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దీవెన దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కాగా, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ గంగాధర సింగిల్ విండో అధ్యక్షుడు దూలం బాలాగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు బొల్లాడి మంజుల, వేముల దామోదర్, ముక్కెర మల్లేశం, ఎంపీటీసీ ముద్దం జమున, నాయకులు ముద్దం నగేశ్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, కర్ర బాపురెడ్డి, రామిడి సురేందర్, రామిడి సురేందర్, సముద్రాల అజయ్ తదితరులు పాల్గొన్నారు.