జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజాభూమారెడ్డి,ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలతో సమావేశం
చొప్పదండి, మార్చి 15: పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఈనెల 17న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజాభూమారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. పట్టణంతో పాటు మండలంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మండల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు మండలంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, చొప్పదండి మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు.
పట్టణ ప్రగతి కింద నిధులు మంజూరు చేస్తూ పట్టణాలను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజాభూమారెడ్డి మాట్లాడుతూ, పట్టణంలోని ఝూన్సీ విద్యాలయం నుంచి నవోదయ విద్యాలయం వరకు సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైన్, ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 33 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏఎంసీ చెర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, వ్యవసాయ మార్కెట్లో రూ. 14 కోట్ల 2 లక్షల 42 వేలతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి సభా స్థలం పరిశీలన
చొప్పదండికి గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ వస్తున్నందున స్థానిక జడ్పీ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసే సభా స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనుల ప్రారంభోత్సవం అనంతరం సభ ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి అదనపు కలెక్టర్‌కు చెప్పారు. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, మండల కో-ఆర్డినేటర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, కౌన్సిలర్లు నలుమాచు జ్యోతి-రామకృష్ణ, కొత్తూరి మహేశ్, కొత్తూరి స్వతంత్ర భారతీనరేశ్, మాడూరి శ్రీనివాస్, దండె జమున-కృష్ణ, మహేశుని సంధ్య-మల్లేశం, వడ్లూరి గంగరాజు, సర్పంచులు గుంట రవి, వెల్మ నాగిరెడ్డి, దామెర విద్యాసాగర్‌రెడ్డి, గుడిపాటి సురేశ్, లింగంపెల్లి లావణ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు పాషా, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్‌రెడ్డి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, నాయకులు బందారపు అజయ్ కుమార్, వడ్లకొండ శ్రీనివాస్, బీ రాజశేఖర్, యువరాజు, మంద శ్రీరాం, జహీర్, మావురం మహేశ్, రావన్, చోటు, వెంకటరమణారెడ్డి, మహేశుని మల్లేశం పాల్గొన్నారు.