మానకొండూర్ రూరల్, మార్చి 1: మానకొండూర్ మండలం గంగిపల్లి, కొండపల్కల, ఈదులగట్టెపల్లి, లింగాపూర్ గ్రామాల్లోని శివాలయాల్లో మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఆలయ ధర్మకర్త రెడ్డి సంపత్ రెడ్డి హాజరయ్యారు. గంగిపల్లిలోని ఏదుగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం నిర్వహించగా ఎమ్మెల్యే రసమయి తలంబ్రాలు, సుడా చైర్మన్ పూర్ణ కుంభంతో హాజరయ్యారు. మొదటగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే, సుడా చైర్మన్‌కు కోలాట బృందం సభ్యులు ఆటాపాటలతో ఘన స్వాగతం పలికారు. పూజల్లో జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్ల వంశీధర్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రేమిడి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ రంగు భాస్కరాచారి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.
మానసాదేవి ఆలయంలో…
గన్నేరువరం, మార్చి 1 : మండలంలోని మానసాదేవి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన శివకల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకగా పట్టు వస్ర్తాలను ఎమ్మెల్యే తలపై మోస్తూ తీసుక వచ్చి శివపార్వతులకు సమర్పించారు. జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ బద్ధం తిరుపతిరెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండలా ధ్యక్షులు తీగల మోహన్‌రెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, సర్పంచ్ గంప మల్లీశ్వరి, ఎంపీటీసీ ఏలేటి స్వప్న, ఉప సర్పంచ్ బద్ధం సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.