జమ్మికుంట, ఫిబ్రవరి 28: సైన్స్ డే సందర్భంగా సోమవారం విద్యాలయాల్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్‌డేను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యం నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు 150కి పైగా ఎగ్జిబిట్స్ తయారు చేసి ప్రదర్శించారు. తర్వాత అత్యుత్తమ ప్రదర్శనలిచ్చిన విద్యార్థులకు ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, పట్టణ సీఐ రాంచందర్‌రావు, మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ బహుమతులు అందించారు. తర్వాత ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడారు. విద్యార్థులంతా గొప్పగా చదువుకోవాలని, సమాజానికి మార్గదర్శకులుగా మారాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, ఫిబ్రవరి 28: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం సాంబయ్య మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ, స్వామి, వేణు, మారుతీప్రసాద్, సమ్మిరెడ్డి, మల్లయ్య, శంకర్, వినోద్, ప్రమీల, నాగరాజు, శ్రీదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకునూర్లో..
సైదాపూర్, ఫిబ్రవరి 28: ఆకునూర్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు ఎగ్జిబిట్స్ తయారు చేసి ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాల రమణారెడ్డి, హెచ్ఎంలు అనురాధ, విజయ్‌కుమార్, ఉపాధ్యాయురాలు రామలక్ష్మి పాల్గొన్నారు.
మామిడాలపల్లిలో..
వీణవంక, ఫిబ్రవరి 28: మామిడాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు ఎన్ భుజన్చందర్, ఏ సురేందర్ ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శన, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం టీ శ్రీనివాసరాజు, ఉపాధ్యాయులు సరితారాణి, సరోజన, సుజాత, ప్రభావతి పాల్గొన్నారు.
ఏకశిల పాఠశాలలో..
హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 28: తుమ్మనపల్లి గ్రామ శివారులోని ఏకశిల సీబీఎస్సీ పాఠశాలలో సైన్స్‌డే సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఎక్స్‌షో సందర్శకులను ఆకట్టుకున్నది. ముందుగా కార్యక్రమాన్ని సింగాపూర్ కిట్స్ కళాశాల ఈఈఈ విభాగం హెచ్వోడీలు డాక్టర్ ఆచార్య యోగిశ్, యశ్వంత్పుండరిక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన సుమారు నాలుగు వందలకు పైగా సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి, అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్, ఉపాధ్యాయులు కుమారస్వామి, రాజశేఖర్, శ్రీధర్, ప్రవీణ్, శ్రీనివాస్, సునీత, నాగమణి, భవాని, మానస, విద్యార్థులు పాల్గొన్నారు.
అలాగే చెల్పూర్ జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకున్నది. హెచ్ఎం అంజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.