కార్పొరేషన్, ఫిబ్రవరి 28: నగరంలోని శ్రీచైతన్య ఐపీఎల్ పాఠశాలలో సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను తిలకించి వారిని అభినందించారు. విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకత, పరిశీలనా దృష్టి, నూతన ఆవిషరణలకు ఇలాంటి ప్రదర్శనలే మూలంగా నిలుస్తాయన్నారు. ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ఆచార్య, చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్మణ్‌రావు, బాలకృష్ణారెడ్డి, మధుకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సాయి మానేరు పాఠశాలలో..
స్థానిక సాయి మానేరు పాఠశాలలో నిర్వహించిన వేడుకలకు మేయర్ వై.సునీల్‌రావు హాజరై విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, తెలంగాణ జూడో సంఘం ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, మానే రు విద్యాసంస్థల ప్రతినిధులు అనంతరెడ్డి, సునీతారెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులున్నారు.
16వ డివిజన్లో..
16వ డివిజన్లోని పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి కార్పొరేటర్ బోనాల శ్రీకాం త్ హాజరై విద్యార్థులకు బహుమతులు అందించారు. ‘మన ఊరు-మన బడి’ కింద పాఠశాల లో అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఐ గ్రీన్ బోర్డులు, పాఠశాల నేమ్ బోర్డు అందిస్తానని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ శ్రీరాములు, హెచ్ఎం షేక్ శాంతి, ఉపాధ్యాయులు దేవదాసు, విజయలక్ష్మి, సుధారాణి, శ్రీనివాస్, రవీందర్‌గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురసరించుకొని సోమవారం నగరంలోని సైన్స్ మ్యూజియం ఎదుట ఉన్న సీవీ రామన్ విగ్రహానికి డీఈవో సీహెచ్ వీఎస్ జనార్దన్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా సైన్స్ అధికారి బోడ జయపాల్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి మారం స్వదేశ్‌కుమార్, జెండర్ ఈక్విటీ కో ఆర్డినేటర్ డాక్టర్ కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
అల్ఫోర్స్‌లో..
వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ పాఠశాలలో అల్ఫోర్స్ సైన్స్ మ్యాజిక్-2022 కార్యక్రమాన్ని విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. సీవీ రామన్ సేవలను కొనియాడారు. పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించగా, సుమారు 250 మంది విద్యార్థులు వివిధ ఆకర్షణీయమైన నమూనాలను ప్రదర్శించి నైపుణ్యాన్ని చాటారు. ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులున్నారు.
శ్రీచైతన్య పాఠశాలలో..
జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య పాఠశాలలో జరిగిన సైన్స్‌ఫేర్‌కు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు. ప్రదర్శనలు తిలకించారు.
పారమిత పాఠశాలలో..
పద్మనగర్‌లోని పారమిత పాఠశాలల్లో విద్యార్థులు వివిధ శాస్తవేత్తల వేషధారణలతో నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాలల చైర్మన్ ప్రసాద్‌రావు ప్రదర్శనలు తిలకించారు. పాఠశాల డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన, అనూకర్‌రావు, వీయూఎం ప్రసాద్, వినోద్‌రావు, ప్రిన్సిపాళ్లు సంజయ్ భట్టాచార్య, శ్రీకర్, హనుమంతరావు, ప్రశాంత్, ఎస్‌వోడీ గోపీకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వివిధ విద్యా సంస్థల్లో..
జ్యోతినగర్‌లోని ఇంగ్లిష్ యూనియన్ పాఠశాలలో కరస్పాండెంట్ దొంతనేని వినోద్‌రావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా, విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ పద్మజ, ప్రధానోపాధ్యాయుడు సంపత్‌రెడ్డి, ఉపాధ్యాయులు రామకృష్ణ, దీపక్, హెప్సీబ, రోహిణి తదితరులు పాల్గొన్నారు. రాంనగర్‌లోని వేదం పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా కరస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్‌గౌడ్ తదితరులున్నారు. హనుమాన్ నగరంలోని బ్లూబెల్స్ హైస్కూల్లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక్కడ జంగ సునీత-మనోహర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మారుతీనగర్‌లోని రిషి ప్లే స్కూల్లో విద్యా సంస్థల చైర్మన్ చెన్నప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకున్నది. గణేశ్‌నగర్‌లోని వసంత వ్యాలీ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో కరస్పాండెంట్ ఏ స్వరూప-బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.