గన్నేరువరం, ఫిబ్రవరి 28: విద్యార్థులు సీవీ రామన్‌ను ఆదర్శంగా తీసుకుని గొప్ప శాస్త్ర వేత్తలుగా ఎదగాలని ఎస్ఐ మామిడాల సురేందర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ డేను పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన సోమవారం సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు కట్టా రవీంద్రాచారి, సర్పంచ్ పుల్లెల లక్ష్మీలక్ష్మణ్, వైస్‌ఎంపీపీ న్యాత స్వప్నాసుధాకర్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ చైర్మన్ బుర్ర మల్లేశ్ గౌడ్ పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ‘చాణక్య’ విద్యార్థులు
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని చాణక్య ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణారెడ్డి విద్యార్థులకు పోలీసు విధులు, సైబర్ నేరాలు, ఎఫ్ఐఅర్ నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్, ఉపాధ్యాయులు రామ్‌సాగర్, శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.
కొత్తగట్టు గుట్టను సందర్శించిన విద్యార్థులు
నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన చాణక్య హైస్కూల్ విద్యార్థులు మండలంలోని కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి గుట్టపై సందడి చేశారు. పాఠశాలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థులు ఆలయ చారిత్రక నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. మత్స్యావతార విశేషాలు, గుట్టపై కోనేరు ప్రాముఖ్యత, ఆలయ అభివృద్ధిలో కాకతీయుల పాత్ర తదితర అంశాలు వివరించినట్లు హెచ్ఎం రవీందర్ తెలిపారు. కొత్తగట్టు పర్యటన విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందిస్తునందని చెప్పారు. సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన జడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ్ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. హెచ్ఎం రాజిరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ సారంగపాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టెక్నాలజీకి మూలం సైన్స్..
అన్ని టెక్నాలజీలకు మూలం సైన్స్ అని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ జీ శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రాజెక్ట్ ఎక్స్పోను నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శన కనబరచిన విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ విశ్వనాథ్ వినోద్, ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, డైరెక్టర్ సీహెచ్ ప్రకాశ్‌రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సంధ్యారెడ్డి, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సైన్స్ డే సంబురాలు
పచ్చునూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం 28వ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు సుమతీ రాణి విద్యార్థులు తయారు చేసి వివిధ ఎగ్జిబిట్స్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు ఓదెలు కుమార్, సుజాత, అనిత, రాజేశ్వర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, లిల్లీ సరోజిని, విజయకుమారి, వెంటకలక్ష్మి, ఆంజనేయులు, సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.
తిమ్మాపూర్‌లో..
మండల కేంద్రంలోని శ్రీచైతన్య పాఠశాలలో సోమవారం విజ్ఞానశాస్త్ర దిన వేడుకలను చైర్మన్ ఎం శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అతిథులుగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్లు పెద్దపల్లి జితేందర్, కచ్చు రవి హాజరయ్యారు. ప్రిన్సిపాల్ నాగరాజు, శ్రీవిద్య, లక్ష్మణ్‌రావు, రాజు, కృష్ణారావు, విజయకృష్ణ, జ్యోతి పాల్గొన్నారు.