చొప్పదండి, ఫిబ్రవరి 28: సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ సూచించారు. సీవీ రామన్ జయంతిని పురస్కరించుకుని జాతీయసైన్స్ దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని గీతావిద్యాలయంలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆమె తిలకించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాబోయే తరాలకు కాబోయే శాస్త్రవేత్తలు విద్యార్థులేనని తెలిపారు. అంతకుముందు నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలకేంద్రంలోని సమీకృత హస్టల్లో విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖన, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎస్ఐ వంశీకృష్ణతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. ఇక్కడ పాఠశాల చైర్మన్ ఆనంద్‌రెడ్డి, వార్డెన్లు సత్యం, రాజేశం, గోవులకొండ అనిల్, కరీం, నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుకూరి సాయికృష్ణ, ఉపాధ్యక్షుడు జాగిరి సాయి, తాడూరి శివకృష్ణ, గంగు సంపత్, కొత్త అఖిల్, మునిగంటి రాజు, ఏముండ్ల రాకేశ్, రాజు, బొడిగె శ్రీకాంత్, హరీశ్ పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
మండలంలోని కురిక్యాల, ఉప్పరమల్యాల ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను ప్రదర్శించారు. కురిక్యాలలో సర్పంచ్ మేచినేని నవీన్‌రావు ప్రదర్శనలు తిలకించి విద్యార్థులను అభినందించారు. హెచ్ఎంలు పురుషోత్తం, నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యాలయాల్లో ప్రదర్శనలు
భౌతికశాస్త్ర నిపుణుడు చంద్రశేఖర వెంకటరామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ పరిశోధనా ఫలితాన్ని పురస్కరించుకొని సోమవారం మండలంలోని అన్ని విద్యాలయాల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. గోపాల్రావుపేట శ్రీప్రగతి హైస్కూల్లో విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలను మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, మాజీ చైర్పర్సన్ పూడూరి మణెమ్మ పరిశీలించి విద్యార్థులను అభినందించారు. వెలిచాల సరస్వతీ హైస్కూల్, కోనరావుపేట కేజీబీవీలో విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. గోపాల్రావుపేట, గుండి, రామడుగు, రుద్రారం, వెదిర, వెలిచాల, దేశరాజ్‌పల్లి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించారు. గోపాల్రావుపేట అల్ఫోర్స్, అక్షర, రామడుగు బ్రిలియంట్ పాఠశాలల్లో సైన్స్ డే సంబురాలను జరుపుకొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎంసీ డైరెక్టర్లు పైండ్ల శ్రీనివాస్, మచ్చ గంగయ్య, కట్కూరి మల్లేశం, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు అన్నదానం రాధాకృష్ణ, ఉప్పుల శ్రీనివాస్, మినుకుల మునీందర్, తోట కిరణ్‌కుమార్, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
చామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య ప్రారంభించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రదానం చేశారు. హెచ్ఎం కోట లక్ష్మారెడ్డి, ఎంఈవో మధుసూదనాచారి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కోట వేంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నగునూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలలో విద్యార్థులు హైడ్రోజన్ బెలూన్లు తయారు చేసి ఆకాశంలోకి ఎగురవేశారు. సీవీ రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సైన్స్ ఉపాధ్యాయులు కన్నం అరుణ, గడమల్ల శంకరయ్య, మిలుకూరి శ్రీనివాస్, పన్నాటి శ్రీనివాస్‌ను సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం కోట వెంకటేశ్వర్లు, ఎస్ఎంసీ చైర్మన్ కస్తూరి రాజు, ఉపాధ్యాయులు, శ్రీలత, షమీమ్, నాజ్, అనసూయ, శాంతమ్మ, మల్లేశం, సంజీవచారి, శ్రీనివాస్, సరస్వతి, ఆదయ్య, అశోక్, సీఆర్పీ ఆర్చనాభారతి, విద్యార్థులు పాల్గొన్నారు. తీగలగుట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ డే నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మ, సైన్స్ ఉపాధ్యాయురాలు అనిత, విద్యార్థులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నగునూర్‌లో ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ దేవి, శ్రీహరి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.