చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ర్యాలపల్లిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం
గంగాధర, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ర్యాలపల్లిలో రూ. కోటీ 30 లక్షలతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్, రూ.24 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. అలాగే ర్యాలపల్లిలో రూ.16 లక్షలతో పల్లె దవాఖాన, రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, కొండాయపల్లిలో రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, జడ్పీటీసీ పుల్కం అనురాధ, ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలగౌడ్, వెలిచాల తిర్మల్‌రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు పుల్కం నర్సయ్య, ఉప్పుల గంగాధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు పుల్కం గంగన్న, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, సర్పంచులు పానుగంటి లక్ష్మీనారాయణ, వేముల దామోదర్, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి, కోలపురం లక్ష్మణ్, నాయకులు అట్ల శేఖర్‌రెడ్డి, దూలం శంకర్‌గౌడ్, ఆముదాల రమణారెడ్డి, రేండ్ల శ్రీనివాస్, వంగల మల్లికార్జున్, నిమ్మనవేణి ప్రభాకర్, దానె ఓదెలు, నిమ్మనవేణి ప్రభాకర్, మ్యాక వినోద్, సుంకె అనిల్, గంగాధర సంపత్ పాల్గొన్నారు.