జిల్లాకేంద్రంలోని స్వరూప గార్డెన్స్‌లో కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారం
4వేల బైక్‌లతో భారీ ర్యాలీగా వేదిక వద్దకు..
హాజరుకానున్న మంత్రి కొప్పుల, మండలి విప్ భానుప్రసాదరావు,ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దాసరి
భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు
పెద్దపల్లి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ);టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కోరుకంటి చందర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం జిల్లాకేంద్రంలోని స్వరూప గార్డెన్స్‌లో ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మండలి విప్ భానుప్రసా దరావు, ఎంపీ వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హాజరుకానుండగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. –
పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితుడైన కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఆదివారం మధ్యాహ్నం పెద్దపల్లిలోని స్వరూపగార్డెన్స్లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి కొప్పుల హాజరై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. మండలి విప్ టీ. భానుప్రసాదరావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత. ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తదితరులు హాజరుకానున్నారు.
బైక్ ర్యాలీగా వేదిక వద్దకు..
కోరుకంటి చందర్ ఆదివారం ఉదయం 9గంటలకు గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి 4వేల బైకులతో ర్యాలీగా పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ వేదికవద్దకు చేరుకుంటారు. ర్యాలీకి గోదావరిఖనిలో పార్టీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలుకనున్నారు. రామగుండం క్రాస్ రోడ్డు, అంతర్గాం, పాలకుర్తి, పెద్దపల్లి మండలాల్లోని పలు గ్రామాల మీదుగా స్వరూపగార్డెన్స్ కు చేరుకోనున్నారు. పెద్దపల్లిలో జిల్లా దవాఖాన వద్ద గల టీఆర్ఎస్ జెండాను కోరుకంటి చందర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం స్వరూప గార్డెన్స్‌లో 11గంటలకు ప్రమాణం చేయనున్నారు. జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని 13మండలాల్లోని టీఆర్ఎస్ పార్టీ మండల, గ్రామ, రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ పట్టణశాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర కార్యవర్గ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మార్గెట్ కమిటీ, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తరలిరానున్నారు.