ఇండ్ల యజమానులు అనుమతి తీసుకునేలా చూడాలి
మేయర్ వై సునీల్‌రావు
కార్పొరేషన్, ఫిబ్రవరి 26: భవన నిర్మాణ రంగంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని, నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మేయర్ వై సునీల్‌రావు పిలుపు నిచ్చారు. నగరంలోని ‘శ్వేత’ హోటల్లో శనివారం కరీంనగర్ కన్సల్టెంట్ సివిల్ ఇంజినీర్స్, ఆరిటెక్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మేయర్ మాట్లాడుతూ, ఇంజినీర్లు ప్రపంచ నిర్మాతలుగా, అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తున్నారన్నారు. ఇంజినీర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇండ్ల యజమానులు నగరపాలక సంస్థ అనుమతి తీసుకునేలా ఇంజినీర్లు కృషి చేయాలన్నారు. కరీంనగర్ స్మార్ట్‌సిటీ అభివృద్ధికి ఇంజినీర్లు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏసీసీఈఐ సౌత్ వైస్ ప్రెసిడెంట్ కే రాజ్‌కుమార్, సంఘం అధ్యక్షుడు ఈగల రాజేందర్, చైర్మన్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ హరికిషన్, కోశాధికారి భీమనాతిని రంజిత్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ అశ్విన్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
శివరాత్రి వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానం
భగత్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మేయర్ వై సునీల్‌రావును సప్తగిరికాలనీ గంగాపరమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి వేడుకలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక అభిషేకం కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.