ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండి మండలం వెదురుగట్టలో క్రికెట్ పోటీలు ప్రారంభం
చొప్పదండి, ఫిబ్రవరి 26: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో పంతంగి అమృతమ్మ స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని అన్నారు. యువత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. ఉపాధి అవకాశాల కల్పించేందుకు ఐటీ రంగం జిల్లా కేంద్రాలకు వ్యాపించడం జరిగిందన్నారు. ప్రైవేట్ కంపెనీల్లో పెట్టుబడులను ప్రోత్సహించి యువతకు ఉపాధి కల్పించడంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, ఎంపీటీసీ పెంచాల రమ్య-అంజయ్య, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, జిల్ల్లా సభ్యుడు మచ్చ రమేశ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు గన్ను శ్రీనివాస్‌రెడ్డి, గొల్లపెల్లి శ్రావణ్ కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, సీపెల్లి గంగయ్య, మారం యువరాజ్, కొత్తూరి రాజేందర్, యశోద రాజయ్య, మావురం మహేశ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి సర్కారు పెద్దపీట
గంగాధర, ఫిబ్రవరి 25: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని గర్శకుర్తి గ్రామానికి చెందిన అభిలాష్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చూపించుకోగా చికిత్స కోసం రెండున్నర లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుటుంబసభ్యులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వం ద్వారా రూ. 2 లక్షల 50 వేల ఎల్వోసీ మంజూరు చేయించారు. కాగా, బూరుగుపల్లిలోని నివాసంలో శనివారం ఆయన అభిలాష్ కుటుంబ సభ్యులకు ఎల్వోసీ మంజూరు పత్రం అందజేశారు. ఎల్వోసీ ద్వారా ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు అభిలాష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకుడు తడిగొప్పుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.