జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా
నేడు పల్స్ పోలియో కార్యక్రమం
విద్యానగర్, ఫిబ్రవరి 26 : అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుకలు వేయించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా తెలిపారు. శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమంపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా జనాభా 11,19,947 ఉండగా ఇందులో 5 సంవత్సరాలలోపు పిల్లలు 83,596 మంది ఉన్నారని తెలిపారు. వీరందరికీ మొదటి రోజు ఆదివారం పోలియో చుకలు ఇప్పించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పోలియో చుకలు వేస్తారని తెలిపారు. ఈ నెల 28, మార్చి 1 న ఇంటింటి సర్వే చేసి పోలియో చుకలు తీసుకోని పిల్లలకు చుకలు వేస్తామన్నారు. పోలియో నిర్వహణపై అంగన్వాడీ టీచర్లు, ఆశ వరర్లు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 545 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 399, పట్టణాల్లో 146 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కరీంనగర్ అర్బన్‌లో 118 కేంద్రాలు, హుజూరాబాద్ పట్టణంలో 16 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 27 మొబైల్ కేంద్రాలు, 8 ట్రాన్సిట్ గ్రూపులు, 54 మంది పర్యవేక్షకులను నియమించామని తెలిపారు. ప్రమాద తీవ్రత ఎకువగా ఉన్న 259 ప్రదేశాలను గుర్తించి అకడ నివసించే 6189 కుటుంబాల్లోని 2061 మంది పిల్లలకు పోలియో చుకలు వేయించేలా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. 1995 నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 2011 నుంచి దేశంలో పోలియో కేసులు నమోదు కాలేదని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 1998 నుంచి ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. పొరుగు దేశాల్లో పోలియో కేసులు ఉన్నాయని, అకడి నుంచి వలస వచ్చే ప్రజల ద్వారా పోలియో వ్యాపించే ప్రమాదమున్నందున పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నామని వివరించారు. అనంతరం పల్స్ పోలియో పోస్టర్లను ఆవిష్కరించారు. ఇక్కడ జిల్లా వైద్యారోగ్య శాఖ ఉప వైద్యాధికారి సుధాకర్, డాక్టర్ సుజాత, డాక్టర్ అతుల్ పాల్గొన్నారు.