సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 20: బొగ్గు రవాణాలో వేగం పెంచి .. వినియోగదారులకు సకాలంలో అందించేందుకు యాజమాన్యం ఆధునిక టెక్నాలజీని వాడుకుంటున్నది. ఇందులో భాగంగా పాతదాని చోట కొత్త ప్రీ వే వ్యాగన్ లోడింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నది. శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో రూ. 70 కోట్లతో దీనిని నిర్మిస్తున్నది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకొని సామర్థ్యాన్ని పెంచుకుంటున్న సంస్థ, 10 వేల టన్నుల కెపాసిటీతో కొత్త బంకర్‌ను చేపట్టింది. వచ్చేనెలల దీనిని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది.
బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో రవాణా కూడా అదేస్థాయిలో జరిగేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంటున్న ది. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీని వాడుకుంటున్నది. దీంతో సమయం ఆదా అవడమే కాకుండా వేగంగా రవాణా జరుగుతున్నది. శ్రీరాంపూర్‌లో 7 భూగర్భ, 2 ఉపరితల గనులు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గును ఎప్పటికప్పుడు సీహెచ్‌పీలకు తరలిస్తుంటారు. ఇక్కడి నుంచి రైలు మార్గం ద్వారా జైపూర్ ఎస్టీపీపీతో పాటు ఒప్పందం చేసుకున్న ఇతర పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు. రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణాలో ఏదైనా అంతరాయం కలిగితే రైల్వే శాఖ సింగరేణికి పెద్ద మొత్తంలో డ్యామేజ్ చార్జీలు వేస్తుంది. అనుకున్న సమయానికి ఒప్పందం చేసుకున్న పరిశ్రమలకు బొగ్గు అందకపోతే, అక్కడా ఇబ్బందులు తప్పవు. దీంతో రవాణా విషయంలో యాజమాన్యం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది.
ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా..
శ్రీరాంపూర్ ఏరియాలో 40 ఏళ్ల క్రితమే కోల్ హ్యాండ్లింగ్ ప్లాం ట్(సీహెచ్‌పీ)ను ఏర్పాటు చేశారు. ఈ సీహెచ్‌పీకి గోదావరిఖని, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల నుంచి బొగ్గు సరఫరా అ వుతుంది. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓసీ, కాసిపేట-2 ఇైంక్లెన్, రామగుండం ఏరియాలోని జీడీకే-2, 2ఏ ఇైంక్లెన్, 7ఎల్ఈపీ, శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5, 6, 7, ఆర్కే న్యూటెక్, ఇందారం-1ఏ భూగర్భ గనులతో పాటు శ్రీరాంపూర్, ఇందారం ఓసీపీల నుంచి రోజూ వారీగా ఉత్పత్తి అయిన జీ-9, జీ-10 రకం బొగ్గు సీహెచ్‌పీకి వస్తుంది. సీహెచ్‌పీకి బొగ్గు రవాణా చేసేందుకు ఆరుగురు ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా లారీల్లో ఆయా ఏరియాల్లో ఉత్పత్తి అయిన బొగ్గును ఇక్కడికి చేరవేస్తున్నారు. రోజుకు 250 నుంచి 300 ట్రిప్పుల వరకు సీహెచ్‌పీకి తరలిస్తున్నారు.
రూ. 70 కోట్లతో నిర్మాణం..
పాత ప్రీ వే వ్యాగన్ లోడింగ్ సిస్టంను తొలగించి, రూ. 70 కోట్ల వ్యయంతో కొత్తదాన్ని నిర్మిస్తున్నారు. చెన్నైకి చెందిన మెరిట్ టెక్నాలజీస్ సంస్థ ఈ నిర్మాణం చేపడుతున్నది. మరికొన్ని పనులను ఇతర సంస్థలు చేస్తున్నాయి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీతో ఈ లోడింగ్ సిస్టంను నిర్మిస్తున్నారు. 400 క్యూబిక్ మీటర్లు, 320 టన్నుల కెపాసిటీతో సర్జ్ బంకర్ నిర్మిస్తున్నారు. 90క్యూబిక్ మీటర్లు, 70 టన్నుల కెపాసిటీతో హాపర్ నిర్మిస్తున్నారు. జీ-9, 10 రకం బొగ్గును ఈ బం కర్ ద్వారా వేరు చేసే సదుపాయం ఉంది. ఈ సౌకర్యం పాత లోడింగ్ సిస్టంలో లేదు. అలాగే పాత సిస్టంలో 6వేల టన్నుల బొగ్గు కెపాసిటీ ఉంటే, 10వేల టన్నుల కెపాసిటీతో కొత్తది నిర్మిస్తున్నారు. ఈ సిస్టం ద్వారా తక్కువ సమయంలో, అనుకున్న ప్రకారం బొగ్గు లోడింగ్ జరిగి రవాణా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైల్వే శాఖకు సింగరేణి నుంచి డ్యామేజ్, షెంటింగ్ చార్జీలు కట్టడం తప్పుతుంది. ఒక ర్యాక్‌లో 3500 నుంచి 4వేల టన్నుల బొగ్గును గంటలో నింపుతుంది. పాత సిస్టంలో 3 గంటల వ్యవధి పట్టేది. మైక్రో ప్రాసెస్డ్ బేస్డ్ సిస్టం ఉండడంతో ఆటోమెటిక్‌గా వేయింగ్ అండ్ లోడింగ్ జరుగనుంది. ఇందులో ఉన్న ఆటోమెటిక్ కంట్రోల్ సిస్టం ద్వారా రవాణా స్టార్టింగ్, స్టాపింగ్ చూసుకునే అవకాశం కల్పించారు. బెల్ట్‌పై వెళ్తున్న బొ గ్గు మూవ్‌మెంట్‌ను సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూం నుంచి పరిశీలించవచ్చు. అలాగే మరో ముఖ్యమైనది ఆటోమెటిక్ డస్ట్ సప్రెషన్, ఫైర్ ప్రొటెక్షన్ ఉంటుంది. 500 టీపీహెచ్(టన్ పర్ హవర్) క్రషర్స్ ఏర్పాటు చేస్తున్నారు. పాత సిస్టంలో 200 టీపీహెచ్ క్రషర్స్ మాత్రమే ఉండేది.
ఏటా 4మిలియన్ టన్నుల రవాణా..
కొత్తగా నిర్మిస్తున్న ప్రీ వే వ్యాగన్ లోడింగ్ సిస్టం అందుబాటులోకి వస్తే ఇక్కడి నుంచి ఏటా 4మిలియన్ టన్నుల బొగ్గు ర వాణా జరుగనుంది. ప్రస్తుతం పాత సిస్టంతో ఏటా 3మిలియన్ టన్నులు మాత్రమే రవాణా అవుతుంది.శ్రీరాంపూర్ జీఎం సూచనలతో సీహెచ్‌పీ డీజీఎం వెంకటేశ్వర్రావు ఎప్పటికప్పు డు పనులను పర్యవేక్షిస్తున్నారు. మార్చిలో ఈ కొత్త సిస్టంను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రీ వే వ్యాగన్ లోడింగ్ సిస్టం ప్రత్యేకతలు ఇవే..
జీఎల్ బంకర్ కెపాసిటీ 10వేల టన్నులు
తక్కువ సమయంలో బొగ్గు లోడింగ్ చేసుకునే సదుపాయం
జీ-9, 10 రకం బొగ్గును బంకర్లో వేర్వేరు చేసుకోవచ్చు
ఒక ర్యాక్(59వ్యాగన్లు)లో రవాణా అయ్యే 4వేల టన్నులను గంటలో లోడింగ్ చేస్తుంది
మైక్రో ప్రాసెస్డ్ బేస్డ్ సిస్టంతో వేయింగ్ అండ్ లోడింగ్ అవుతుంది
500 టీపీహెచ్(టన్ పర్ హవర్) క్రషర్స్ ఏర్పాటు
రవాణాపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి
యాజమాన్యం బొగ్గు రవాణాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బొగ్గు నిల్వ లేకుండా పకడ్బందీ చర్యలు తీసు కుంటున్నది. ఉత్పత్తి అయిన బొగ్గు ను వెనువెంటనే ఒప్పందం చేసుకు న్న పరిశ్రమలతో పాటు పవర్ ప్లాం ట్‌కు పంపిస్తున్నాం. ఈ ప్రక్రియలో మరింత వేగం పెంచ డానికి రూ.70 కోట్లతో వ్యాగన్ లోడింగ్ సిస్టం అందుబా టులోకి తెస్తున్నాం. మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– ఎం సురేశ్, జీఎం, శ్రీరాంపూర్
వేగంగా పనులు
కొత్తగా నిర్మిస్తున్న వ్యాగన్ లోడింగ్ సిస్టం పనులు వేగంగా సాగుతున్నా యి. జీఎం సూచనల మేరకు రోజూ వారీగా పనులు పర్యవేక్షిసున్నాం. కొత్తగా నిర్మిస్తున్న లోడింగ్ సిస్టం అందుబాటులోకి వస్తే శ్రీరాంపూర్ నుంచి వేగంగా బొగ్గు రవాణా జరుగుతుంది. దీంతో రైల్వే శాఖ నుంచి డ్యామేజ్ చార్జీల బాధ తప్పు తుంది. ఫిబ్రవరి నెలతో దాదాపు పనులన్నీ పూర్తి చేయా లనే సంకల్పంతో ఉన్నాం.
– వెంకటేశ్వర్రావు, సీహెచ్‌పీ డీజీఎం