కొడిమ్యాల, ఫిబ్రవరి 20: స్వరాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. హిమ్మత్‌రావుపేట, నాచుపల్లి వయా రామారావుపేట నుంచి చెప్యాల బైపాస్-దొంగలమర్రిని కలిపే తారురోడ్డుకు రూ.2 కోట్ల 64 లక్షల 39 వేలు మంజూరు కాగా, ఆదివారం శిలాఫలాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామగ్రామాన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, పంచాయతీరాజ్ డీఈ మనోహర్, ఏఈ భూపతి, వైస్ ఎంపీపీ ప్రసాద్, కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, సర్పంచులు అంబటి లత, గరిగంటి మల్లేశం, పిల్లి మల్లేశం, ఏగుర్ల తిరుపతి, ఎంపీటీసీ ఉట్కూరి మల్లారెడ్డి, బసనవేని మహేశ్, మండల కో ఆప్షన్ సభ్యుడు నసిరొద్దీన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, నాయకులు అంబటి తిరుమలేశ్, సమిరిసెట్టి సురేశ్, గంగుల మల్లేశం, రొడ్డ శరత్, కొరండ్ల నరేందర్‌రెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, నేరెళ్ల మహేశ్, కొలకాని సత్యం, గుండు రాజ్‌కుమార్, అర్జున్‌కుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.