గంగాధర, ఫిబ్రవరి 20: ప్రత్యేక పంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం పల్లెలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మంగపేటలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను సర్పంచ్ తోట వేదాంతి-మహిపాల్ దంపతులు సన్మానించారు. కార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, శ్రీమల్ల మేఘరాజు, ఆకుల శంకరయ్య, పొట్టల కనకయ్య, మాల చంద్రయ్య, దోర్నాల హన్మంతరెడ్డి, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, ఉపసర్పంచులు బీ కార్తీక్‌రెడ్డి, వేముల శ్రీధర్, నాయకులు వేముల అంజి, రామిడి సురేందర్, శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.