రామడుగు, ఫిబ్రవరి18 : సమ్మక్క గురువారం సాయంత్రం గద్దెకు చేరుకోగా, అంతకు ముందురోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెకు చేరడంతో వనదేవతలందరూ గద్దెలపై కొలువుతీరారు. శుక్రవారం మండలంలోని గుండి, గోపాల్రావుపేట, రామడుగు, తిర్మలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు పోటెత్తారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు నిలువెత్తు బంగారాన్ని తూకం వేసి అమ్మవార్లకు సమర్పించారు. అమ్మవార్లకు ఇంటిల్లిపాదీ తలనీలాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వ్యాపారులు వరుసగా దుకాణాలను ఏర్పాటు చేయడంతో కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం గిరిజన దేవతలు వనంలోకి వెళ్తారని జాతర నిర్వాహలు తెలిపారు.
గంగాధరలో..
మండలంలోని మధురానగర్, బూరుగుపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. బూరుగుపల్లిలో ఎంపీటీసీ దూలం లక్ష్మి-శంకర్‌గౌడ్ దంపతులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. జాతర కమిటీ సభ్యులు ఎంపీటీసీ దంపతులను సన్మానించారు. జాతర కమిటీకీ ఎంపీటీసీ రూ.5,116 విరాళం అందజేశారు. రేకుర్తి జాతరకు వచ్చిన భక్తుల దాహార్తిని తీర్చేందుకు గంగాధర మండల రైతు బంధు కోఆర్డినేటర్ పుల్కం గంగన్న నీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు. బూరుగుపల్లిలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం సమ్మకసారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యంను నిర్వాహకులు సన్మానించారు.
మేడారంలో నాయకులు
మేడారం సమ్మక్క సారలమ్మ ను శుక్రవారం గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు పుల్కం నర్సయ్య, బండపెల్లి యాదగిరి దర్శించుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చొప్పదండిలో..
సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా శుక్రవారం చొప్పదండి మండలకేంద్రంతో పాటు ఆర్నకొండ, గుమ్లాపూర్, రాగంపేటలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చొప్పదండిలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, కౌన్సిలర్లు, కమిషనర్ వనదేవతలకు మొక్కులు చెల్లించారు.
వన దేవతలకు మొక్కలు చెల్లించిన భక్తులు
కరీంనగర్ మండం బొమ్మకల్ హౌసింగ్ బోర్డులోని సమ్మక్కను మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు విఘ్నేశ్, లక్ష్మణ్ గురువారం రాత్రి గద్దెలపై ప్రతిష్టించారు. శుక్రవారం నగునూర్ గ్రామానికి చెందిన సాయిల శివయ్య, ఒగ్గు కళాకారుల బృందం ఒగ్గు కథను వినిపించారు. భక్తుల మొక్కలను సమర్పించారు. ఆలయకమిటీ సభ్యుడు తోట మోహన్, మాజీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, కమిటీ సభ్యులు మిర్యాలకర్ నరేందర్, గూట్ల శంకర్, బొల్లం లింగమూర్తి, బిజిగిరి నవీన్, నందుకుమార్, ఆది మల్లేశం, మహేశ్, మధు, సుధాకర్, లింగంపల్లి సత్యనారాయణ, అనిల్, మహేశ్, మధు, రాజు భక్తులకు ఏర్పాట్లు చేశారు.
ఇరుకుల్లలో కోయ పూజారి సమ్మయ్య, నిర్వాహకుడు బుర్ర చంద్రయ్య ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మను ప్రతిష్టించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్యులు ప్రత్యేక శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు జగన్మోహన్రెడ్డి, ప్రసాద్, సంపత్, రాజేశ్వర్‌రావు, బుర్ర రమేశ్‌గౌడ్, సర్వర్‌పాషా, శ్రీనివాస్ రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, నర్సయ్య, ఓదెలు, గూడ తిరుపతిరెడ్డి, కిషన్‌రావు, భక్తులు పాల్గొన్నారు.
నగునూర్ ఎర్ర గుట్ట వద్ద నుంచి సమ్మక్క, సారలమ్మ లను తీసుకొచ్చిన కోయ పూజారి భాస్కర్‌రెడ్డి గద్దెల పైన ప్రతిష్టించారు. నిర్వాహకులు వెంకట్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, ఉపసర్పంచ్ దామెరపల్లి దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీలు సాయిల వినయ్‌కుమార్, అంకమ్మల శ్రీనివాస్, వరి భద్రయ్య, రవితేజ, మహేశ్, దిలీప్గౌడ్, రాజాగౌడ్, ఆంజనేయులు, లక్ష్మయ్య, శ్రీనివాస్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
చింతకుంటలో..
మండలంలోని చింతకుంట సమ్మక్క- సారలమ్మను ఎంపీపీ దంపతులు పిల్లి శ్రీలతా మహేశ్‌గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. ఇక్కడ చింతకుంట ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్ ఉన్నారు.
పోలీసులు, వలంటీర్ల సేవలు..
రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద పోలీసులు, సాన్వి, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ వలంటీర్లు సేవలందించారు. కొత్తపల్లి కౌన్సిలర్లు, రేకుర్తి ముదిరాజ్ సంఘం నాయకులు రూ.లక్ష విలువ చేసే తాగునీటి ప్యాకెట్లు భక్తులకు అందుబాటులో ఉంచారు.