కార్పొరేషన్, ఫిబ్రవరి 17: నగరంలోని తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో 68 కిలోల కేక్ ఏర్పాటు చేయగా, మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి కట్ చేసి, మొక్కలు పంపిణీ చేశారు. మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. దేశాభివృద్ధిలోనూ సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, కార్పొరేటర్లు జయశ్రీ, తోట రాములు, నాయకులు కర్రె సూర్యశేఖర్, మొగిలోజు వెంకట్, ఉదారపు మారుతి, రేణుక, హరికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, రవిగౌడ్, రాజు పాల్గొన్నారు. 25వ డివిజన్లో కార్పొరేటర్ ఎడ్ల సరిత-అశోక్ ఆధ్వర్యంలో మేయర్ వై సునీల్‌రావు చేతుల మీదుగా కోళ్లు పంపిణీ చేశారు. సమ్మక్క జాతర సాగుతున్నందున ప్రజలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కోళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
టీఆర్ఎస్ నాయకులు రవి, శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు. అలాగే, మేయర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ వై సునీల్‌రావు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. టీఆర్ఎస్ నాయకులు అంజన్‌రావు, వెంకట్రావు, వినోద్, ప్రకాశ్, ఆనంద్ పాల్గొన్నారు. అలాగే, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సమ్మక్క జాతరకు వెళ్తున్న భక్తులకు మేయర్ వై సునీల్‌రావు చేతుల మీదుగా కోళ్లు పంపిణీ చేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 59వ డివిజన్లో గందె మాధవీమహేశ్ ఆధ్వర్యంలో స్థానిక భవిత వృద్ధాశ్రమంలో చీరెలు, పండ్లు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. కార్పొరేటర్ వాల రమణారావు, కో-ఆప్షన్ సభ్యుడు అజిత్‌రావు, నాయకులు పాల్గొన్నారు. 30వ డివిజన్ కార్పొరేటర్ నేతికుంట యాదయ్య ఆధ్వర్యంలో స్థానిక క్యాన్సర్ దవాఖానలో అన్నదానం చేయగా, మేయర్ వై సునీల్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సమ్మక్కకు ఎత్తు బంగారం
సీఎం కేసీఆర్ 68వ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో రేకుర్తిలోని సమ్మక జాతర వద్ద 68 కిలోల బంగారం తూకం వేశారు. మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్ బంగారాన్ని తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. 68 కొబ్బరికాయలు కొట్టి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణాగౌడ్, ఎదుర్ల రాజశేఖర్, జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు జక్కుల మల్లేశం, శ్రావణ్‌రెడ్డి, కత్తి శ్రీనివాస్, మాడిశెట్టి అజయ్, శనిగరపు సతీశ్, గంగాధర చందు పాల్గొన్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ఆకుల ప్రకాశ్ అన్నదానం చేశారు. టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు యూసుఫ్ ఆధ్వర్యంలో స్థానిక దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనార్టీ నాయకులు ఫహాద్, షానబీ తదితరులు పాల్గొన్నారు. మారెట్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 500 మందికి అన్నదానం చేశారు.
గంజ్ హైస్కూల్‌ను దత్తత తీసుకొని పరిసరాలను శుభ్రం చేసి, రంగులు వేయించినట్లు సర్దార్ రవీందర్‌సింగ్ తెలిపారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొకలు నాటారు. టీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, కెమసారం తిరుపతి, కలర్ సత్తన్న, భాసర్‌రావు, కృష్ణయాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గందె మహేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యదర్శి రవీందర్, మాజీ కార్పొరేటర్ కోడూరి రవీందర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, సభ్యులు బాలకిషన్, వరప్రసాద్, మధు తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని సమ్మక గద్దెల వద్ద అమ్మవార్లకు టీఆర్ఎస్ నాయకులు నరేందర్, లింగమూర్తి, గూట్ల శంకర్, ఎడ్ల మధు, గాండ్ల రమేశ్, గుగ్గిళ్లపు మహేశ్ బంగారం (బెల్లం) సమర్పించారు.
కార్ఖానాగడ్డలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు టీఆర్ఎస్ నాయకుడు మొగిలోజు వెంకట్ ఆధ్వర్యంలో మేయర్ వై సునీల్‌రావు చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. నాయకులు కర్ర సూర్యశేఖర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు మీర్జా అజ్మత్ అలీ బేగ్ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఫహాద్, అబ్దుల్ రహమాన్ బాబా తదితరులు పాల్గొన్నారు. నగరంలో టీఆర్ఎస్ నాయకుడు పెండ్యాల మహేశ్‌కుమార్ చిన్నారులతో కేక్ కట్ చేయించారు. టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సూర్య, శ్యాంసుందర్, అజయ్, పవన్ పాల్గొన్నారు. భగత్‌నగర్ చౌరస్తా వద్ద తెలంగాణ జాగృతి యువత జిల్లా అధ్యక్షుడు ఉయ్యాల విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ అనువోజు రవికాంత్, యూత్ టౌన్ కో-కన్వీనర్ వంగపల్లి సందీప్‌రెడ్డి, రమేశ్, ఎల్లయ్య, శరత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని టీఆర్వీకేఎస్ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. జేఏవోలు అనిల్‌కుమార్, మధు, సురేందర్, మునీందర్, తిరుపతి, లక్ష్మీనారాయణ, రామేశ్వర్, సత్యనారాయణ, మాధవ్, నజీబ్, కృష్ణ, జమీర్, నారాయణ, శ్రీహరి, మోహన్, దేవరాజ్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్పర్సన్ ఎలుక అనిత-ఆంజనేయులు కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్‌రెడ్డి, డైరెక్టర్లు సాదుల వెంకటేశ్వర్లు, రావ రాజు, ఇనుకొండ మురహరిరెడ్డి, పెట్టం రమేశ్, ఎండీ అక్బర్, వంగల శ్రీలత-శ్రీనివాస్‌రెడ్డి, బిక్కుమల్ల సత్యనారాయణ, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో మేయర్ వై సునీల్‌రావు, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి 68 మొక్కలు నాటారు. మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. గ్రంథాలయ కార్యదర్శి సరిత, ఉద్యోగులు, సిబ్బంది మల్లేశం, శంకర్, ఆర్ సరిత, గౌతమి, టీఆర్ఎస్ నాయకులు ఎండీ ఫహాద్, రవివర్మ, తేజ, జీవన్ పాల్గొన్నారు.
కొత్తపల్లిలోని మార్కండేయస్వామి ఆలయంలో కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వాసాల రమేశ్, వేముల కవిత, గున్నాల విజయ, స్వర్గం వజ్రాదేవి, జెర్రిపోతుల మొండయ్య, చెట్టిపెల్లి ప్రభాకర్, వెంకట్‌రెడ్డి, అంకూస్, కొత్త రాజయ్య, చింతల ప్రతాప్‌రెడ్డి, ఎస్కే బాబా, కట్ల సుధాకర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఫక్రొద్దీన్, నాయకులు మనోహర్, చింతల ప్రతాప్‌రెడ్డి, టీ మురళి, తుమ్మ ప్రతాప్‌రెడ్డి, వేముల సాగర్, మెరుగు మల్లేశం, పొన్నం శ్రీనివాస్, పెంటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వావిలాలపల్లిలోని నాయీబ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సంఘం నాయకులు జంపాల సంపత్, జయరాం, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కుల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు జీఎస్ ఆనంద్ ఓ పేద వృద్ధురాలికి హ్యాండిల్ స్టాండ్ అందజేశారు. టీఆర్ఎస్ నాయకులు గౌస్‌పాషా, కొలిపాక శ్రీనివాస్, మహేందర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. న్యాయవాదులు కేవీ వేణుగోపాలరావు, పీవీ రాజ్‌కుమార్, గడ్డం లక్ష్మణ్, గౌరు రాజిరెడ్డి, తుమికి పవన్‌కుమార్, విజయభాసర్, లక్ష్మణ్‌రావు, ఆరెల్లి రాములు గౌడ్, సుధాకర్, మంచికట్ల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 17: 8వ డివిజన్లో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జాప శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఇక్కడ డీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామి రెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, సీహెచ్ పరశురాం తదితరులు పాల్గొన్నారు.