తిమ్మాపూర్ రూరల్, ఫిబ్రవరి17: తెలంగాణ అభివృద్ధి ప్రదాత, జన నేత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా ఊరూ వాడా ఏకమై.. ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఎల్ఎండీ కాలనీలో టీఎన్జీవో జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు కేక్ కట్ చేశారు. పర్లపల్లి శ్రీ భవానీ చంద్రమౌలీశ్వరాలయంలో రుద్రాక్ష, కదంబ మొక్కలను సర్పంచ్ మాదాడి భారతి, ఎంపీటీసీ ముప్పిడి సంపత్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి నాటారు. బాలయ్యపల్లిలో టీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మన్నెంపల్లిలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మక్తపల్లి హనుమాన్ ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు పూజలు నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు మేడి అంజయ్య, రావ రాజు, పొన్నం అనిల్, పారునంది జలపతి, గాండ్ల శ్రీనివాస్ ఉన్నారు. మండల కేంద్రంలోని మానకొండూర్ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ పిడిశెట్టి సంపత్ విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. సిబ్బంది పాల్గొన్నారు.
శంకరపట్నంలో..
మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో చైర్మన్ తూముల శ్యాంరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేశవపట్నం మసీదులో మైనార్టీ యువజన సంఘం నాయకుడు అలీమొద్దీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముత్తారం చర్చిలో క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లింగాపూర్‌లో హుజూరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంతం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం 200 మంది మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, సర్పంచులు మొకిరాల కిషన్‌రావు, పంజాల రేణుక, ఎంపీటీసీ మోతె భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, ఉప సర్పంచులు హన్మంత్, సంపత్, ఆలయ ధర్మకర్తలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కుమార్, తిరుపతి, బొజ్జ కోటిలింగం, రాజమల్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడిలో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు అందె సుజాత, చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి కేక్ కట్ చేశారు. సుందరగిరి వేంకటేశ్వరాలయంలో ఆలయ చైర్మన్ తాళ్లపల్లి సంపత్ ఆధ్వర్యంలో ఎంపీపీ, నాయకులు పూజలు చేశారు. చిగురుమామిడి చర్చిలో ప్రార్థనలు చేశారు. మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు సర్వర్ పాషా ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మసీదులో కేక్ కట్ చేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ, సూపరింటెండెంట్ ఖాజా మొయినుద్దీన్ ప్రజాప్రతినిధులతో కలిసి మొకలు నాటారు. రామంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గీట్ల తిరుపతిరెడ్డి పూజలు చేశారు. ఉల్లంపల్లిలో సర్పంచ్ చేప్యాల మమత మొకలు నాటారు. రేకొండ గౌరీశంకరాలయంలో సర్పంచ్ పిట్టల రజిత పూజలు నిర్వహించారు.
వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, మారెట్ కమిటీ డైరెక్టర్ అందె పోచయ్య, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, సర్పంచులు సన్నీళ్ల వెంకటేశం, సుద్దాల ప్రవీణ్, బెజ్జంకి లక్ష్మణ్, ముప్పిడి వెంకటనర్సింహారెడ్డి, ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, నాయకులు మంకు శ్రీనివాస్‌రెడ్డి, పెనుకుల తిరుపతి, అనుమాండ్ల సత్యనారాయణ, ఒంటెల కిషన్‌రెడ్డి, సిద్దెంకి రాజమల్లు, గీట్ల తిరుపతి, ముకెర సదానందం, బెజ్జంకి రాంబాబు, రాచకొండ సంపత్, బుర్ర తిరుపతి, తోడేటి శ్రీనివాస్, అందె పరశురాములు, సంపత్‌రెడ్డి, ఎంపీవో శ్రావణ్ కుమార్, ఏపీవో లక్ష్మీపేరందేవి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం చిన్న ములనూరు బస్టాండ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బుర్ర తిరుపతి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటనరసింహారెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, నాయకులు పెసర రాజేశం, సదానందం, సారంగం, ఐలయ్య ఉన్నారు. మండల కేంద్రంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య కార్యాలయంలో సెర్ప్ ఉద్యోగులు మొకలు నాటారు. సీసీలు సత్యనారాయణ, గంప సంపత్, వెంకటమల్లు ఉన్నారు.
మానకొండూర్‌లో..
గంగిపల్లి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏఎంసీ మాజీ చైర్మన్ వాల ప్రదీప్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్, ఆర్బీఎస్ కన్వీనర్ కడారి ప్రభాకర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ముంజంపల్లిలో సర్పంచ్ రామంచ గోపాల్‌రెడ్డి, చెంజర్లలో టీఆర్ఎస్ నాయకుడు గడ్డి గణేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. మానకొండూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్‌గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఇడుమాల సంపత్, నాయకులు రెడ్డి సంపత్‌రెడ్డి, పారిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, భూమా అనిల్, పరశురాములు, మల్క సతీశ్, హరీశ్, రవీందర్‌రెడ్డి, గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతిగౌడ్, గణపతిరెడ్డి, మల్యాల రాములు, గొస్కుల స్వామి, రాజ్‌కుమార్, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు బొంగోని రేణుక, శామంతల శ్రీనివాస్, మీడియా సెల్ మండల ఉపాధ్యక్షుడు అనిల్‌గౌడ్, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మానకొండూర్ పల్లెమీద జడ్పీటీసీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, పీఏసీఎస్ చైర్మన్ నల్ల గోవింద రెడ్డి, వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్‌గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు వాల ప్రదీప్ రావు, మల్లగల్ల నగేశ్, ఎంపీటీసీ కవిత, ఏఎంసీ డైరెక్టర్ కొండ్ర నిర్మల, నాయకులు ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, పిట్టల మధు, పాషా, సందీప్, సతీశ్ ఉన్నారు.
గన్నేరువరంలో..
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో కాసింపేట మానసాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి, రైతు బంధు సమితి సభ్యుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పారువెల్ల లక్ష్మీగణపతి ఆలయంలో పూజలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. గన్నేరువరంలో సర్పంచ్ పుల్లెల లక్ష్మీలక్ష్మణ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే రసమయి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు బంధు సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్నాసుధాకర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫీ, నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, లింగాల మహేందర్‌రెడ్డి, అటికం శ్రీనివాస్, మీసాల ప్రభాకర్, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.