గంగాధర, ఫిబ్రవరి 17: 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం మండలంలోని కొండన్నపల్లి సహస్ర లింగేశ్వరాలయంలో స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మండల నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, తెలంగాణ రాష్ర్టాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్కం అనురాధ, సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు పుల్కం నర్సయ్య, బండపెల్లి యాదగిరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, ముక్కెర మల్లేశం, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు రేండ్ల శ్రీనివాస్, ఆకుల మధుసూదన్, అలువాల తిరుపతి, నిమ్మనవేణి ప్రభాకర్, ఎగుర్ల మల్లయ్య, ఎం అఖిల్, మ్యాక వినోద్, శ్రీధర్ పాల్గొన్నారు.
బూరుగుపల్లి సమ్మక్క జాతరలో ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, సర్పంచ్ సాగి రమ్య మొక్కులు చెల్లించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సింగిల్ విండో అధ్యక్షుడు దూలం బాలగౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు పూజలు చేశారు. మండల కేంద్రంలో సర్పంచ్ మడ్లపెల్లి గంగాధర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్ కేక్ కట్ చేశారు. కోట్లనర్సింహులపల్లిలో సర్పంచ్ తోట కవిత ఆధ్వర్యంలో వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు.
హిమ్మత్‌నగర్‌లో టీఆర్ఎస్ నాయకుడు బండారి శ్రీనివాస్, వెంకటాయపల్లిలో వేముల శ్రీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సర్పంచులు వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు రేండ్ల శ్రీనివాస్, జారతి సత్తయ్య, పొన్నం వెంకటేశం, ఆకుల మధుసూదన్, మ్యాక వినోద్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని సాయిబాబా ఆలయ ఆవరణలో ఆయన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే, మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ శ్రేణులు మొక్కలు నాటారు. ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, కౌన్సిలర్లు నలుమాచు జ్యోతి-రామకృష్ణ, కొత్తూరి స్వతంత్ర-నరేశ్, మాడూరి శ్రీనివాస్, మహేశుని సంధ్య-మల్లేశం, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, సాయిబాబా ఆలయ చైర్మన్ గుర్రం హన్మంతరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చెట్టిపల్లి పద్మ, బీసవేని రాజశేఖర్, నాయకులు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గాండ్ల లక్ష్మణ్, జహీర్, పబ్బ సత్యం, తోడేటి డేవిడ్, మారం యువరాజ్, మావురం మహేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
దేశరాజ్‌పల్లిలోని ప్రశాంత్ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్‌రావు చేతుల మీదుగా చిన్నారులకు పండ్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఇక్కడ మాజీ సర్పంచ్ రవీందర్రావు, నాయకులు సంజీవరావు, ఆరెపల్లి ప్రశాంత్, వంగల రమణ, పవన్, సంజీవ్, పోశెట్టి పాల్గొన్నారు. గోపాల్రావుపేట వేంకటేశ్వరాలయంలో టీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగునూర్‌లో సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు తొంటి లక్ష్మణ్, ఎంపీటీసీలు అంకమల్ల శ్రీనివాస్, వినయ్‌సాగర్, ఉపసర్పంచ్ దామెరపల్లి దామోదర్‌రెడ్డి, నాయకులు సాయిల మహేందర్, బీ ఆంజనేయులు, నెక్పాషా, పెంచాల శ్రీనివాస్ రావు, దాపు రవితేజ, దిలీప్గౌడ్, నరేందర్, హఫీజ్, రాజుబాబు, శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, బాపు రెడ్డి, మధుకర్, వరి భద్రయ్య, దావు రాజిరెడ్డి, బోగొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. చెర్లభూత్కూర్ జెండా చౌరస్తాలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు కూర శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, బుర్ర తిరుపతి, ఆంజనేయులు, కూర రంగారెడ్డి, మెరుగు శ్రీధర్, సతీశ్ పాల్గొన్నారు. ఇరుకుల్ల సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బుర్ర రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో 68 కొబ్బరికాయలు కొట్టారు.
ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జువ్వాడి రాజేశ్వర్‌రావు, సర్వర్‌పాషా, ఎంపీటీసీ ర్యాకం లక్ష్మి, మోహన్, జక్కు అజయ్, హరీశ్, బలుసుల శంకర్ పాల్గొన్నారు. చేగుర్తి వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారికి సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గాండ్ల కొమురయ్య ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఉపసర్పంచ్ గాండ్ల విజయ, సింగిల్ విండో డైరెక్టర్ గాండ్ల అంజయ్య, ఆలయ కమిటీ చైర్మన్ అశోక్‌గౌడ్, ఎంపీటీసీ స్వరూప-చంద్రమోహన్, వార్డు సభ్యుడు కిషన్, నాయకులు పాల్గొన్నారు. చేగుర్తి 7వ వార్డులో ఎంపీటీసీ స్వరూప మొక్కలు నాటారు. వార్డు సభ్యుడు కాంపల్లి వెంకటేశం, కాలనీవాసులు పాల్గొన్నారు. బొమ్మకల్‌లో ఎంపీటీసీ ర్యాకం లక్ష్మి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ఎంపీటీసీ ర్యాకం మోహన్, హరీశ్, దిలీప్, అజయ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. చామనపల్లి ఉమామహేశ్వర ఆలయంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజలు చేశారు.
ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. ఆరెల్లి శ్రీనివాస్, కుర్మ సంఘం అధ్యక్షుడు బోగొండ ఐలయ్య, చిన్న తిరుపతి, లక్ష్మీరాజం, మహేశ్, రాములు, ఆంజనేయులు పాల్గొన్నారు. ఇరుకుల్లలోని వెలమ సంఘం వృద్ధాశ్రమంలో మాజీ సర్పంచ్ జువ్వాడి మారుతి రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వృద్ధులకు పండ్లు, బ్రెడ్, స్వీట్లు పంచిపెట్టారు. కొమ్ము సునీల్, లింగంపల్లి ప్రవీణ్, కాశిపాక నర్సయ్య, బలుసుల శ్రావణ్, అనిల్‌గౌడ్, కాశిపాక మహేశ్, రాపోలు అనిల్, కొయ్యడ విష్ణువర్ధన్ గౌడ్ పాల్గొన్నారు. తీగలగుట్టపల్లిలో ఆర్బీఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్, 2వ డివిజన్ కార్పొరేటర్ కాశెట్టి లావణ్య కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. సింగిల్ విండో డైరెక్టర్ మూల రవీందర్ రెడ్డి, రాజయ్య, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.