కరీంనగర్ రూరల్: డిసెంబర్ 15: డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగుతో రైతులకు అధిక లాభం ఉంటుందని కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి వీ శ్రీధర్ పేర్కొన్నారు. అధికారులు ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. క రీంనగర్ మండలం దుర్శేడ్ రైతు వేదికలో జిల్లా స్థాయిలో ఎంపికైన 34 మంది సర్పంచ్లు, పం చాయతీ సెక్రటరీలు, వ్యవసాయ విస్తరణ అధికారులకు డ్రమ్ సిడర్ పద్ధతిపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఎం పికైన 34 గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు డ్రమ్సీడర్ పద్ధతిపై రైతులకు సమగ్రంగా వివరిం చాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య మాట్లాడుతూ ఏడాదిపాటు రోజుకు రూ. 250 చొప్పున నగదు జమ చేసి సంవత్సరం తరువాత 20 శాతం వ్యవసాయశా ఖ పనులకు, 80 శాతం గ్రామ పంచాయతీ పనులకు వినియోగించుకోవాలని సూచించారు.
వ్యవసాయ పరిశోధనా స్థానం చింతకుంట ప్రధాన శా స్త్రవేత్త మంజులత మాట్లాడుతూ బురద పద్ధతిలో విత్తకునే డ్రమ్ సీడర్లో ప్రధాన సమస్య అయిన కలుపు నివారణ కోసం జాగ్రతలు తీసుకోవాలని తెలిపారు. రసాయన ఎరువుల వాడకం, నీటి, వ రి కలుపు యాజమా న్య పద్ధతులు, నీటి తీరువా అధికంగా లేకుండా చర్యలు తీసుకోవాలని వివరించారు. మూడు లేదా ఐదు రోజుల్లో లేదా 15 లేదా 20 రోజుల్లో వరి విత్తనం చల్లి, వాడాల్సిన ఎరువుల గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాజుల వెంకటమ్మ, దుర్శేడ్ సింగిల్ విండో ఇన్చార్జి చైర్మన్ గోనె నర్సయ్య, డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు మదన్మోహన్రెడ్డి, రాజేంద్రప్రసాద్, ఏడీఏలు అంజని, సునీత, శ్రీనివాస్, రామారావు, ఎంవో టీచ్ స్వప్న, ఆత్మ చైర్మన్ అరెల్లి శ్రీనివాస్, ఏవో సత్యం, ఏఈవో ప్రణయ్ ఉన్నారు.