పనికంటూ తీసుకెళ్లి లైంగికదాడికి యత్నం
పనికి వస్తావా అంటూ.. వెంట తీసుకువెళ్లి వివస్త్రను చేసి హింసించి లైంగిక దాడికి యత్నించిన కామాంధుడిని సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు.
- తప్పించుకున్న మహిళ
- పోలీసులకు ఫిర్యాదు
- నిందితుడి అరెస్టు
- వివరాలు వెల్లడించిన సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్
సిరిసిల్ల రూరల్/ఇల్లంతకుంట, నవంబర్ 22: పనికి వస్తావా అంటూ.. వెంట తీసుకువెళ్లి వివస్త్రను చేసి హింసించి లైంగిక దాడికి యత్నించిన కామాంధుడిని సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఇల్లంతకుంట మండలం ఒగులాపూర్కు చెందిన గంట తిరుపతి(39) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ నెల 15న సిరిసిల్లలోని లేబర్అడ్డాలో పని కోసం వచ్చిన మహిళను చూసి, ఎలాగైనా అనుభవించాలన్న ఉద్దేశంతో పని ఉందని మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఒగులాపూర్ శివారులోని గుట్టల ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెకు బలవంతంగా బీరు తాగించి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె తిరుపతి చెర నుంచి తప్పించుకుని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం విచారణ చేపట్టారు. ఎట్టకేలకు వారం రోజులకు నిందితుడిని పట్టుకున్నారు. మంగళవారం ఒగులాపూర్ గ్రామపంచాయతీ ప్రాంతంలో తిరుపతిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ ఉపేందర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మహేందర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

