వీణవంక, నవంబర్ 19: స్వచ్ఛతను పాటించడం వల్ల ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య చెప్పారు. టాయిలెట్ డే సందర్భంగా మండలంలోని గంగారం అంగన్వాడీ సెంటర్లోని మరుగుదొడ్డిని యూనిసెఫ్ నిధులతో మరమ్మతు చేయించగా, శనివారం సర్పంచ్ కోమాల్రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డితో కలిసి పునఃప్రారంభించారు. అనంతరం డీపీవో వీరబుచ్చయ్య మాట్లాడుతూ, అందరూ పరిశుభ్రత పాటించడం ద్వారా అంటు వ్యాధులను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. ఇండ్లల్లోని చెత్తను ఆరుబయట పడేయద్దన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ కో ఆర్డినేటర్ కిషన్‌స్వామి, ఎంపీవో ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి ఉదయ్‌కుమార్, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ వీవోలు, తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌టౌన్, నవంబర్ 19: ప్రపంచ మరుగుదొడ్ల దినం సందర్భంగా శనివారం హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని ప్రజా మరుగుదొడ్ల నిర్వాహకులను బల్దియా అధికారులు ఘనంగా సత్కరించారు. వినోద్, రాంబీర్, మున్ని, శివను ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ వినయ్, హెల్త్ అసిస్టెంట్ కిషన్‌రావు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో శానిటరీ జవాన్లు రాజు, రమేశ్, అనిల్ పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, నవంబర్ 19: మండలంలోని జూపాక, తుమ్మనపల్లి, సింగాపూర్తో పాటు పలు గ్రామాల్లో శనివారం టాయిలెట్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అధికారులు ఇంటింటికీ తిరుగుతూ మరుగుదొడ్డి లేని వారు వెంటనే నిర్మించుకోవాలని సూచించారు. బహిరంగా ప్రదేశాల్లో బహిర్భూమికి వెళ్లకూడదన్నారు. కార్యక్రమంలో అయా గ్రామాల కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
సైదాపూర్, నవంబర్ 19: మండలంలోని లస్మన్నపల్లి, సోమారం, ఎక్లాస్పూర్ గ్రామాల్లో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా లస్మన్నపల్లిలో ఎంపీడీవో పద్మావతి మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత కోసం మరుగుదొడ్లను వాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు కాయిత రాములు, కొత్త రాజిరెడ్డి, పైడిమల్ల సుశీలాతిరుపతిగౌడ్, కార్యదర్శులు హైమ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.