మానకొండూర్ రూరల్, నవంబర్ 10: రైతులు ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, మధ్య దళారులను నమ్మి నష్టపోవద్దని జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ సూచించారు. మండలంలోని లింగాపూర్‌లో గురువారం మానకొండూర్ పీఏసీఎస్ చైర్మన్ నల్ల గోవింద రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మానకొండూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్ గౌడ్, మానకొండూర్ సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, నాయకులు పొల్సాని పీతాంబర్ రావు, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
గన్నేరువరంలో..
గన్నేరువరం, నవంబర్ 10: మండలంలోని యాస్వాడా, చీమలకుంటపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు గంప వెంకన్న, వైస్ ఎంపీపీ న్యాత స్వప్నా సుధాకర్, ప్యాక్స్ చైర్మన్ అల్వాల కోటి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, సర్పంచులు కర్ర రేఖ, జక్కనపెల్లి మధుకర్, ఉప సర్పంచులు బూర వెంకటేశ్వర్లు, ప్రకాశ్, రైతులు పాల్గొన్నారు.
కేంద్రాలను పరిశీలించిన అధికారులు
చిగురుమామిడి, నవంబర్ 9: కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తరలించే రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఏవో రంజిత్ కుమార్, ఏఈవోలు బొల్లం సౌజన్య, అఖిల, సాయికుమార్, శ్రీనివాస్, సతీశ్ కుమార్, ఫరీద్ సూచించారు. మండలంలోని చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ములనూర్, సుందరగిరి, నవాబ్ పేట్, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లె గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం వారు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తారని తెలిపారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.