గంభీరావుపేట, నవంబర్ 9: మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వారికి ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌పై నాబార్డు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. గంభీరావుపేట పీఏసీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అంతకముందు గ్రామాల వారీగా నా బార్డు సౌజన్యంతో ఐఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శిక్షణ, ఉపాధి, మార్కెటింగ్ తదితర అంశాలపై నాబార్డు బృందం సభ్యులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ, మహిళలు నాబార్డు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పొందాలన్నారు. మహిళలకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌పై 15 రోజుల ఉచిత శిక్షణతో పాటు 750 ైస్టెఫండ్, ధ్రువీకరణ పత్రం అందించడం అభినందనీయమన్నారు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌పై చిన్నతరహా వ్యాపారాలు ఏర్పా టు చేసుకునేందుకు కేడీసీసీ బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తామని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన గంభీరావుపేట, కొత్తపల్లి గ్రామాల 60 మంది మహిళలకు ధ్రువీకరణ ప త్రాలతో పాటు 750ల ైస్టెఫండ్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచ్‌లు కటకం శ్రీధర్, అక్కపల్లి స్వరూప, సుతారి బాలరాజు, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, కేడీసీసీ బ్యాంకు సీ ఈవో సత్యనారాయణరావు, నాబా ర్డు డీడీఎం మనోహర్ రెడ్డి, రిసోర్సు పర్సన్ జీ సత్యనారాయణ, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు రాజలింగం, మల్యాల రాజవీర్, సీఈ వో సందుపట్ల రాజిరెడ్డి, మాజీ సింగి ల్ విండో చైర్మన్ అక్కపల్లి రాజనర్సింహారెడ్డి, సలహాదారు పురం సత్యంరావు, ట్రైనర్ అనిత, మహిళలు, నాబార్డుబృందం, సిబ్బంది ఉన్నారు.