ఫర్టిలైజర్‌సిటీ, నవంబర్ 8: రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసా ఇచ్చారు. పాలకుర్తి మండలం ఎల్కలపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. నాడు సమైక్య పాలనలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండుగ అని అన్నారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పండుగలా మార్చి రైతుపక్షపాతిగా నిలిచారని కొనియాడారు. రైతు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడంతో రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఎలాంటి సహకారం అందిచకపోగా రైతుల బాయిల దగ్గర మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల నడ్డివిరిచే చర్యలకు పూనుకుంటుందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రానికి రైతుల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు రైతులందరూ మద్దతుగా నిలువాలని కోరారు. ఇక్కడ ఎంపీపీ అనసూర్య రాంరెడ్డి, సర్పంచ్ పసూల భాగ్యలక్ష్మి, భాస్కర్, మల్లెత్తుల శ్రీనివాస్, దుర్గం జగన్, మెరుగు పోశం, స్వామి, ఎంపీటీసీలు హతిక్, గంగాధరి రమేశ్, ప్యాక్స్ చైర్మన్లు మామిడాల ప్రభాకర్, బయ్యపు మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ పాలకుర్తి, అంతర్గాం మండలాధ్యక్షుడు నవీన్‌కుమార్, తిరుపతి నాయక్, నాయకులు పల్లె శ్రీనివాస్, రాగం శ్రీనివాస్, నూకరాజు, కోల సంతోశ్‌గౌడ్, తానిపర్తి గోపాల్‌రావు, మాదాసు అరవింద్, విసారపు రమేశ్ మధుకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.