పెద్దపల్లి రూరల్, నవంబర్ 8: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలన్న ఉద్దేశంతోనే ఊరూరా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్, రంగాపూర్ గ్రామాల్లో అప్పన్నపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, గ్రేడ్ ఏ రకానికి 2,060, కామన్ రకానికి 2,040 చొప్పున మద్దతు ధరలు నిర్ణయించారని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే సబ్బితం, బొంపల్లి, కనగర్తి, మేరపల్లి, కాపులపల్లి గ్రామాల్లో అప్పన్నపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ సంపత్, సీఈవో తిరుపతి స్థానిక ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆడెపు వెంకటేశం, గంట లావణ్యరమేశ్, చుంచు సదయ్య, అరికిల్ల లక్ష్మయ్య, పర్స స్వప్న అశోక్, గోపు కవిత శ్రీనివాస్, ఎంపీటీసీ తోట శ్రీనివాస్, యేడెల్లి శంకరయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, మాజీ సర్పంచులు అర్కుటి రామస్వామి యదవ్, డైరెక్టర్లు గండు వెంకటేశం, కొత్త వెంకటమ్మ, మందల రాజిరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యెడ సతీశ్ గౌడ్, నాయకులు అంతగిరి కొమురయ్య, తాడిచెట్టి శ్రీకాంత్, బొడ్డ చంద్రయ్య యాదవ్, ఒడ్నాల శంకర్, కొండ సుధాకర్, రమేశ్, కుమ్మరి మోహన్ బాబు, సీపురుశెట్టి వెంకన్నబాబు, నర్సయ్య, సంతోష్, రాజయ్య, రాజ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.