జమ్మికుంట రూరల్, అక్టోబర్ 30: సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని, మతతత్వ బీజేపీకి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని విలాసాగర్లో ఇల్లందకుంట ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేడీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, సర్పంచ్ పింగిళి రమాదేవి, సహకార సంఘం డైరెక్టర్లతో కలిసి జడ్పీ చైర్పర్సన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు జడ్పీ చైర్‌పర్సన్‌ను సర్పంచ్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పచ్చని పంటలతో నిండిపోయిందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకొని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని కోరారు. ఇక్కడ ఇల్లందకుంట పీఏసీఎస్ సీఈవో ఆదిత్య, ఉప సర్పంచ్ అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, నారాయణరెడ్డి, సత్యనారాయణరావు, ఆర్బీఎస్ సభ్యుడు సంపత్, మాజీ ఉపసర్పంచ్ బాబురావు, వార్డు సభ్యులు రమేశ్, సంపత్, శ్రీధర్, టీఆర్ఎస్(బీఆర్ఎస్)గ్రామాధ్యక్షుడు మల్లయ్య , రైతులు లాలయ్య, తిరుపతి, యాదగిరి, సామ్రాజ్యం, శంకర్, పీఏసీఎస్ సిబ్బంది రాజమౌళి, రాజు, వేణు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయం
ఇల్లందకుంట, అక్టోబర్ 30: రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయాగణపతి పేర్కొన్నారు. సీతంపేట గ్రామంలో ఇల్లందకుంట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఏ గ్రేడ్ రకం రూ. 2060, బీ గ్రేడ్ ధాన్యం రూ. 2040 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తునదని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు అన్ని వసతులను కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడ సర్పంచ్ వెంకటస్వామి, ఎంపీటీసీ ఓదెలు, పీఎసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, డైరెక్టర్లు నారాయణరెడ్డి, తిరుపతిరెడ్డి, జగన్, రాజయ్య, సీఈవో ఆదిత్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.