శ్రీరాంపూర్, ఫిబ్రవరి 3 : సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఉప సంహరించుకునేంత వరకూ టీబీజీకేఎస్ పోరాడుతుందని గుర్తింపు కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, అధ్యక్షుడు వెంకట్రావ్, కార్యదర్శి రాజిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపు మేరకు శ్రీరాంపూర్‌లోని గనులు, డిపార్ట్మెంట్లపై గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టారు. ఎస్ఆర్పీ 3గనిపై పిట్ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, ఎస్ఆర్పీ 1గనిపై ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్షణ్, పిట్ కార్యదర్శి ఎంబడి తిరుపతి, శ్రీరాంపూర్ ఓసీపీపై కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, ఆర్కే 5గనిపై పిట్ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, నెల్కి మల్లేశం, ఆర్కే 5బీపై పిట్ కార్యదర్శి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి నీలం సదయ్య, ఆర్కే 6గనిపై ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు, బ్రాం చ్ కార్యదర్శి అడ్డు శ్రీనివాస్, పొగాకు రమేశ్, ఆర్కే 7గనిపై పిట్ కార్యదర్శి మెండ వెంకటి, సహాయ కార్యదర్శి ప్రేంకుమార్, న్యూటెక్‌పై చర్చల ప్రతినిధి బుస్స రమేశ్, పిట్ కార్యదర్శి ఓరం జగన్, సివిల్‌లో పిట్ కార్యదర్శి ప్యాగ మల్లేశం, వర్కషాప్లో పిట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, జీఎం ఆఫీస్‌లో కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, పిట్ కార్యదర్శి పీ వెంకటేశ్వర్రావు, సహాయ కార్యదర్శి రాళ్లబండి రాజన్న ఆధ్వర్యంలో కార్మికులతో సంతకాలు సేకరించారు. బీజేపీ ప్రభుత్వానికి కార్మికవర్గం సరైన సమయంలో ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇక్కడ పోశెట్టి, వెంకట్‌రెడ్డి, రాజిరెడ్డి, దుర్గయ్య తదితరులున్నారు.
తాండూర్, ఫిబ్రవరి 3 : కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ, రాష్ర్టానికి చెందిన నాలుగు సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే విరమించుకొని సంస్థ మనుగడను కాపాడాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియా తాండూర్ మండలం అబ్బాపూర్ ఓసీపీ, ఏరియా స్టోర్స్, ఏరియా వర్క్‌షాప్‌లలో కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. టీబీజీకేఎస్ కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్, చంద్రశేఖర్, మారిన వెంకటేశ్, శ్రీనివాస్‌రెడ్డి, సంపత్, కార్యదర్శులు కార్నాథం వెంకటేశ్, చంద్రయ్య, మల్లేశ్, సంపత్, నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, నర్సింగరావు, రాజన్న, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
జైపూర్, ఫిబ్రవరి 3: శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారంఖని 1ఏ, ఇందారం ఓపెన్‌కాస్టు గనుపై టీబీజీకేఎస్ నాయకులు కార్మికుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటీకరణతో పాటు రాష్ర్టానికి చెందిన బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. పిట్ కార్యదర్శి గడ్డం మల్లన్న, నాయకులు రత్నాకర్‌రెడ్డి, రవీందర్, బొద్దుల మల్లేశ్, రామచందర్, సతీశ్, ప్రకాశ్, అశోక్, వెంకటరమణ, యాకూబ్అలీ, సయ్యద్ ఉల్లాఖాన్, భూమయ్య, రంగు రమేశ్ పాల్గొన్నారు.
కేంద్ర వైఖరిని నిరసిస్తూ మందమర్రి ఏరియాలోని అన్ని గనులు, విభాగాలపై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గనుల ప్రైవేటీకరణ, సంస్థ మనుగడ కోసం చేపట్టబోయే ఆందోళనల్లో కార్మికులు ముందు నిలిచి పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, జే రవీందర్, బడికెల సంపత్, ఓ రాజశేఖర్, ఈశ్వర్, భూపెల్లి కనకయ్య, ఆయా గనులు తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట, ఫిబ్రవరి 3 : మందమర్రి ఏరియాలోని కాసిపేట 1, 2వ ఇైంక్లెన్ గనుల్లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ సింగరేణిపై కేంద్రం అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసిపేట 1వ గనిపై టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ హాజరయ్యారు. కాసిపేట 1వ గనిలో టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దుగుట శ్రీనివాస్, ఏరియా కార్యదర్శి వొడ్నాల రాజన్న, కాసిపేట 2వ గనిలో పిట్ కార్యదర్శి కారుకూరి తిరుపతి, సహాయ పిట్ కార్యదర్శి తాళ్లపల్లి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 3 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సీహెచ్‌పీలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పిట్ కార్యదర్శి జే శ్రీనివాస్, చిలుముల కొమురయ్య, కోల చంద్రమోహన్, తిరుమల్, కల్లెపల్లి శ్రీనివాస్, కొక్కిస మల్లేశ్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో కార్మికుల నుంచి పెద్ద ఎత్తున సంతకాలు సేకరించారు. కైర్‌గూడ ఓసీపీ, గోలేటి సీహెచ్‌పీ, అబ్బాపూర్ ఓసీపీ, వివిధ డిపార్టుమెంట్లలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, టీబీజీకేఎస్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్, కేంద్ర కమిటీ సభ్యు డు అబ్బు శ్రీనివాసరెడ్డి, జీఎం కమిటీ సభ్యులు మారిన వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సంపత్, పిట్ కార్యదర్శులు వెంకటేశం, చంద్రయ్య, మల్లేశ్, సంపత్, నాయకులు నర్సింగరావు, రాజన్న, రామృష్ణ, శ్రీనివాస్ ఉన్నారు.
మందమర్రి ఏరియా శాంతిఖని షాఫ్ట్ వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గని పిట్ కార్యద ర్శి దాసరి శ్రీనివాస్, నాయకులు వెంకటరమణ, రాజనాల రమేశ్, సిద్ధంశెట్టి సాజ న్, కొట్టే రమేశ్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, సేఫ్టీ, మైన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.