చీకట్లు పారదోలే వెలుగుల ఉత్సవం. అందరి జీవితాల్లో సంతోషం నింపే సంబురం. పేద, ధనిక, చిన్నా, పెద్ద తేడా లేకుండా కులాలకతీతంగా జరుపుకునే ఆనందాల పండుగ దీపావళి. ఈ పర్వదినంలో దీపాల కోసం వివిధ ఆకృతుల్లో అందమైన ప్రమిదలు మార్కెట్లకు వచ్చాయి. వీటిని వ్యాపారులు చెన్నై, నాగపట్నం, బెంగుళూరు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాల నుంచి తెప్పించి విక్రయిస్తున్నారు. కలశం, గణపతి, లక్ష్మీదేవి, గజేంద్రుడు, గృహం, గొలుసు, గూడు, కొబ్బరి, తులసికోట, ఆకు, పుష్పం వంటి ఆకారాల్లో ఉండగా, వీటిని ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. డజను రూ.100 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్