కార్పొరేషన్, అక్టోబర్ 11: కమాన్ వద్ద రోడ్డు మరమ్మతులను ప్రారంభించి, మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్, పక్కన మేయర్ సునీల్‌రావు కరీంనగర్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఉద యం కమాన్‌చౌరస్తా వద్ద నగరంలోని 14 కిలోమీటర్ల ప్రధాన రహదారులకు రూ.2.30 కోట్లతో చేపట్టనున్న మరమ్మతు పనులకు మంత్రి భూమిపూజ చేసి మాట్లాడారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, గతంలో ఎన్నడూలేని వి ధంగా నగరంలో ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ఇరువైపులా ఫుట్‌పాత్ నిర్మాణాలను కూడా చేశామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లు పలు ప్రాంతాల్లో దెబ్బతిన్నాయన్నా రు. రోడ్ల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో మరమ్మతు కోసం ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.1.30కోట్లు విడుదల చేయగా, మరో రూ.కోటిని డీఎంఎఫ్ నుంచి కేటాయించాలని కలెక్టర్‌కు విన్నవించగా అవి కూడా మంజూరయ్యాయ ని తెలిపారు. దీంతో 14 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతులు చేస్తున్నామని, ఈ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని వివరించారు. నగరంలోని అన్ని రోడ్లు తళతళలాడేలా అభివృద్ధి చేస్తామన్నారు. రోడ్లను డ్యామేజ్ చేయకుండా చూడాలని ప్రజలకు సూచించారు. నగరాభివృద్ధికి ప్రజలందరూ సహకరిస్తేనే సుందరనగరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో నగరమేయర్ వై.సునీల్‌రావు, కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్లు లెక్కల స్వప్న వేణు, కంసాల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యు డు పుట్ట నరేందర్, నాయకులు తాటి ప్రభావతి, వంగల పవన్, గుగ్గిళ్ల శ్రీనివాస్, వేణు పాల్గొన్నారు.