జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 18: ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఉద్ఘాటించారు. కులమతాలు, పార్టీలకతీతంగా పథకాలు వర్తింపజేస్తున్నదని పేర్కొన్నా రు. అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని చెప్పా రు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్, ధర్మారం, జాబితాపూర్, వెల్దుర్తి, గొల్లపల్లి, వంజరిపెల్లి, నర్సింగాపూర్, అంతర్గాం గ్రా మాల్లో 799 మందికి కొత్త ఆసరా పింఛన్లు, 28 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, 36 మందికి రూ.12.50 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెకులను జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సీఎం కేసీఆర్ పేదలకు పది కిలోల చొప్పున బియ్యం, రూ.1500 అందించారని చె ప్పారు. పల్లె, పట్టణప్రగతితో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయని చెప్పారు. జగిత్యాలను జిల్లా గా చేసి, మెడికల్ కాలేజీ , సూపర్ స్పెషాలిటీ ద వాఖాన మంజూరు చేసిన సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేం ద్ర ప్రసాద్, ఏఎంసీ చైర్పర్సన్ నకల రాధ, స ర్పంచులు చెరుకు జాన్, నారాయణగౌడ్, మమ తా సతీశ్, బుర్ర ప్రవీణ్‌గౌడ్, ప్రకాశ్, రజితా గంగారాం, సరోజనా మల్లారెడ్డి, నారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ దామోదర్‌రావు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ నకల రవీందర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీటీసీలు భూపెళ్లి సునీతా శ్రీ నివాస్, లక్ష్మీ శంకర్, స్వప్నా శ్రీనివా స్, మహేశ్, శ్రీనివాస్, ఉప సర్పంచులు చీటీ రమ్యశ్రీ, ఎకల దేవి తిరుపతి, ప్రణవి, గ్రామాధ్యక్షుడు నగేశ్, రాజు, జలంధర్, కొలగాని రామకృ ష్ణ, వెంకటేశ్, తిరుపతి, గంగారెడ్డి, స్వామిరెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరి, ఎంపీవో రవిబాబు ఉన్నారు.