కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 4: ప్రైవేట్ టీచర్ల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ దిశగా పార్లమెంట్లో చట్టం చేయాలని సూచించారు. వారికి బీమా సదుపాయం కల్పించడంతోపాటు ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ట్రస్మా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోరెం సంజీవరెడ్డి అధ్యక్షతన ఉత్తమ ఉపాధ్యాయులకు వినోద్‌కుమార్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశా రు. ఈకార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డీఈవో సీహెచ్ వీఎస్ జనార్దనా వు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరిశేఖర్రా వు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్లు సమస్యల పరిష్కారానికి సంఘాలు పెట్టుకోవాలని సూచించారు.
విద్యాబోధనలో కీలక భూమిక పోషిస్తున్న ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదన్నారు. చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె మాట్లాడుతూ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాలోని దాదాపు 263 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించి సత్కరించారు. ఇక్కడ ట్రస్మా జిల్లా ప్ర ధాన కార్యదర్శి దాసరి శ్రీపాల్‌రెడ్డి, కోశాధికారి గాజుల తిరుపతి, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు సాధ న శ్రీనివాస్, కార్యదర్శి రెయినో నరేశ్, కోశాధికారి వేదం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లక్ష్మా రెడ్డి, జిల్లా సలహాదారు రమణారావు ఉన్నారు.