వేములవాడ రూరల్ (వేములవాడ), సెప్టెంబర్ 4: దళితుల ఆర్థిక సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం దళితబంధు పథకానికి అంకుర్పారణ చేసిందని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. అదివారం ఆయన పట్టణంలోని 10, 19వ వార్డుల్లో దళితబంధు యూనిట్ల కింద ఏర్పాటు చేసుకున్న ఎలక్ట్రిక్, డిజే షాపులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా రూ. 10 కోట్లతో 100 యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 కోట్లతో కొత్తగా 500 యూనిట్లను మంజూరుకుకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నారు. దళితల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్వేయమన్నారు.
ఏగిని మురళికి ఘన నివాళి
వేములవాడ పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం అధ్యక్షుడు ఏగిని మురళి ఇటీవల మృతిచెందగా ఆయన చిత్రపటం వద్ద ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంతాపసభలో పాల్గొన్నారు. తన తండ్రి చెన్నమనేని రాజేశ్వరావుకు ఏగిని మురళికి ఉన్న సాన్నిహిత్యం గురించి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొక్కుల దయానంద్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు, కౌన్సిలర్లు కుమ్మరి శీరిశ, శ్రీనివాస్‌రావు, మారం కుమార్, సిరిగిరి చందు, విజయ్ తదితరులు ఉన్నారు.