సిరిసిల్లరూరల్, సెప్టెంబర్ 3 : అంతర్ రాష్ట్రా ల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న కిలాడీ దంపతులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలను వె ల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మం డలం బట్వాన్పల్లికి చెందిన తాళ్లపల్లి ప్రసాద్, విజయవాడకు చెందిన ధనలక్ష్మి గతంలో మంచిర్యాల, విజయవాడలో వేర్వేరుగా చోరీలకు పాల్పడేవారు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం వీరికి పరిచ యం ఏర్పడి వివాహం చేసుకున్నారు. తాళం వేసి న ఇళ్లే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారు. ఈ క్రమం లో ఈ ఏడాది ఆగస్టు 14న వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డలో తాళం వేసిన ఇంట్లో దొంగత నం చేశారు. ఇంటి యజమాని ఏనుగుల మనోహర్‌రెడ్డి ఫిర్యాదుతో సీఐ వెంకటేశ్ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర నమ్మదగిన సమాచారంతో కిలాడీ దంపతులను శనివా రం బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లిలోని ప్రసా ద్ ఇంటివద్దే పట్టుకుని, విచారణ చేశారు. వీరి నుంచి 31.8 తులాల బంగారు, 32.5 తులాల వెండి అభరణాలు, రూ.11,500 స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో విజయవాడ, మంచిర్యాల ప్రాంతాల్లో 25 కేసులకు పైగా ఉన్నాయి. వీరు వరుస చోరీలకు పాల్పడుతున్నారని, అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ కత్రోజు నాగేంద్రచారి, వేములవాడ టౌన్ సీఐ వెంకటేశ్, ఎస్ఐ రమేశ్, కానిస్టేబుళ్లు రాజేందర్, సునీత ఉన్నారు.